Telugu TV Serials

కార్తీక్ ను సొంతం చేసుకోవడానికి బిడ్డను అడ్డుపెట్టుకున్న మోనిత.!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్. రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 1446 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ రోజు సెప్టెంబర్ 1 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..కార్తీక్‌కి మరింత దగ్గర కావడానికి మోనిత మరొక నాటకం స్టార్ట్ చేస్తుంది చేతికి దెబ్బ తగిలినట్లుగా అబ్బా అంటూ అరుస్తూ కార్తీక్‌కి చూపించే వంకతో కార్తీక్ భుజాల మీద నుంచి కార్తీక్ మీదకు వంగి ప్రేమ వలకపోస్తుంది మోనిత. కానీ కార్తీక్ చాలా సాధారణంగా చూసి అవునా దెబ్బ తగిలిందా?’ అంటాడు. దాంతో మోనిత రగిలిపోతుంది. ‘ప్రేమ ఎలాగో లేదు.. కనీసం జాలి, దయ కూడా లేవా? నా మీదా?’ అని మనసులోనే అల్లాడిపోతుంది. అసలు నా మీద ప్రేమ కాదు కదా జాలి కూడా లేదా అంటుంది.

బిడ్డను అడ్డుపెట్టుకుని నాటకం మొదలుపెట్టిన మోనిత :

కార్తీక్ నీకో విషయం చెప్పాలి అని నాటకం మొదలుపెట్టిద్ది. నీ కోసం ఎంత చేశానో తెలుసా? ఏం పోగొట్టుకున్నానో తెలుసా అని మనకు ఒక బిడ్డ ఉన్నాడు తెలుసా కార్తీక్ అంటుంది మోనిత.ఏంటీ? మనకి ఓ బిడ్డ ఉన్నాడా అని. షాక్. అవుతాడు.మరి మన బిడ్డ ఎక్కడా?’ అంటాడు కార్తీక్ కంగారుగా.ఇక మోనిత నన్ను క్షమించు ఆనంద్ నువ్వు ఉన్నా లేవు అని చెప్పాలిసిన పరిస్థితి వచ్చింది అని కొడుక్కి క్షమాపణలు చెప్పుకుంటుంది. ‘నీకు యాక్సిడెంట్ జరిగిన రోజు మన బాబుకి 105 జ్వరం నిన్ను ఆసుపత్రిలో చేర్పించడం,నీకు ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం వాడిని ఇంట్లో వదిలేసా వచ్చే సరికి బాబును ఎవరో ఎత్తుకుని పోయారు అని ఏడుస్తుంది.నువ్వు చెప్పేది నిజమా?’ అంటాడు కార్తీక్ కంగారుగా..నిజం కార్తీక్ బిడ్డ లేడు అని ఎవరైనా అబద్దం చెబుతారా? అంటుంది.వెంటనే కార్తీక్ నా కోసం నీ బిడ్డని దూరం చేసుకున్నావా?’ అంటాడు.వెంటనే కార్తీక్ గుండెల మీద వాలిపోతుంది మోనిత.

కార్తీక్ కు గతం గుర్తుకు తెప్పించడానికి దీప ప్లాన్ ఏంటి?

సీన్ కట్ చేస్తే డాక్టర్, డాక్టర్ తల్లికి వంట చేసి వడ్డిస్తు ఉంటుంది. దీప.అది తిన్న ఇద్దరూ.. ‘సూపర్ అంటే సూపర్ అంటూ.నీ భర్త చాలా అదృష్టవంతుడు అంటారు. దాంతో దీప కార్తీక్ ఆలోచనలో పడుతుంది.నా భర్తకు నేను చేసిన వంట అంటే చాలా ఇష్టం’ అంటుంది. దాంతో డాక్టర్ ముందు నీ చేతి వంట నీ భర్తకు తగిలేలా చెయ్యి చాలు ఏ మందులు పనిచేయవు. నీ భర్తకు గతం మొత్తం గుర్తొస్తుంది అంటాడు.ఏ భర్త అయినా తన భార్య వంట గుర్తు పట్టకుండా ఉండడు అంటాడు. దాంతో దీప ‘నా భర్తే నన్ను వెతుక్కుని వచ్చేలా చేస్తాను అన్నయ్యా.. అందుకు నా దగ్గర ఓ ఐడియా ఉంది’ అంటూ ధీమాగా చెబుతుంది.

వంటలక్కను ఇంటికి పిలిపిస్తాను అంటున్న కార్తీక్ :

ఇక కార్తీక్ శివ పేరు మర్చిపోయి ఇదిగో తిరపతి రావయ్యా అంటాడు శివను.అదే సమయంలో మోనిత కనిపించడంతో మన డ్రైవర్ పేరేంటీ?’ అంటాడు శివ’ అంటుంది మోనిత. ఇక శివ రాగానే ‘పదా మేడమ్‌కి ఒక సర్‌ప్రైజ్‌ ఇద్దాం.. బయటికి వెళ్లాలి’ అంటాడు. ‘నాకేం సర్‌ప్రైజ్‌ కార్తీక్’ అంటుంది మోనిత. ‘అదే మోనితా నేను గతం మరిచిపోయి నా నీడని కూడా నేను నమ్మలేకపోతున్నా కానీ నా కోసం మన బిడ్డని నువ్వు దూరం చేసుకున్నాను అని చెప్పావు చూడు అప్పుడు నువ్వు పడ్డ బాధలో నిజం కనిపించింది.నువ్వు నా కోసం బిడ్డని దూరం చేసుకున్నావ్.. కానీ నువ్వు వంట చేస్తూ చేయి కాల్చుకున్నా పట్టించుకోలేదు అప్పుడు నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను సారీ మోనితా అంటాడు కార్తీక్. ‘ఫర్లేదు కార్తీక్.. నాకు ఈ ప్రేమ చాలు’ అంటుంది మోనిత. ‘ప్రేమ ఉందని చెబితే చాలదు.. చూపించాలి కదా.. ఈ రోజు నుంచి నువ్వు ఇలా వంట చేసి చేతులు కాల్చుకోవాల్సిన పని లేదు నీ కోసం వంటలక్కనే తీసుకొస్తాను’ అంటాడు కార్తీక్.ఆ మాట విన్నాక మోనిత,అక్కడే ఉన్న శివ ఇద్దరు. షాక్ అవుతారు.వంటలక్కా.. ఇప్పుడు అదెందుకు కార్తీక్?’ అంటుంది మోనిత కోపంగా.పాపం నేను వాళ్ల డాక్టర్ బాబుని అనుకుని వెంటపడుతుంది కదా నేను మీ డాక్టర్ బాబుని కాదు అని చెప్పి మాకు వంట చేసి పట్టు అని అన్నామే అనుకో తను వచ్చి మనకి వంట చేసినట్లు ఉంటుంది. మనిద్దరినీ చూసి నేను తాను అనుకుంటున్న డాక్టర్ బాబు కాదు అనుకుంటుంది అంటాడు.నో కార్తీక్ అని అరిచి నేను వేరే వంట మనిషిని చూస్తాను అని అంటుంది. సరే దానికి అంత టెన్షన్ పడతావెందుకు? సరే నువ్వు చెప్పినట్లే వద్దులే అంటాడు.

డాక్టర్ ఇల్లు విడనున్న దీప :

సీన్ కట్ చేస్తే దీపని కాపాడిన డాక్టర్, డాక్టర్ తల్లి, రామ్, బంటు నలుగురు దిగులుగా ఇంటి ముందు నిలబడి ఉంటారు. దీప అప్పుడే గుమ్మం లోంచి బ్యాగ్ తీసుకుని వస్తుంది. ‘వెళ్లొస్తాను అన్నయ్య అన్నగానే అందరు షాక్. అవుతారు.నువ్వు ఏమి. చేయాలనుకున్న ఇక్కడే ఉండి చేయొచ్చు కదమ్మా అంటే ఆ మోనిత ఎంత కిలాడీనో చెప్పాను కదా అన్నయ్యా నేను వెళ్లాల్సిందే’ అంటుంది దీప.


Share

Related posts

అటు సామ్రాట్.. ఇటు తులసి.. మధ్యలో నలిగిపోతున్న నందు.. ప్రేమ్ విషయం ఆంటీకి చెబుతానన్న అంకిత..

bharani jella

Devatha 10 August 621: మాధవ్ నీ చంపేస్తానన్న రాధ.. ఆదిత్య నీ మనసులో నా స్థానం ఏంటని అడిగిన సత్య..

bharani jella

Karthika Deepam: జ్వాలకు హిమాలాగా ఫోన్ చేసింది ఎవరు..??

Ram