బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1451 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 7 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో. ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మోనిత ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఆసుపత్రిలో చేరడం దానికి కారణం దీప అని చెప్పడంతో ఆ మాటలను కార్తీక్ నమ్మి దీపను నానా మాటలు అంటాడు. ఇక ఈరోజు సీరియల్లో మోనితని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకోస్తారు. వెంటనే కార్తీక్ శివను పిలిచి ఆవిడ ఉందా? వెళ్లిపోయిందా?అని అడుగుతుంది.లేదు మేడమ్ తాళం వేసి ఉంది అంటాడు శివ.
మోనిత పైశాచిక ఆనందం :
ఆవిడ ఇంకెందుకు ఉంటుందిలే మోనిత నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను కదా అందుకే వెళ్లిపోయి ఉంటుంది’ అంటాడు కార్తీక్. నువ్వు వార్నింగ్ ఇచ్చావా? ఏమని ఇచ్చావ్ కార్తీక్’ అంటుంది మోనిత చాలా సంబరంగా. నా భార్యకే విషం పెడతావా? పరాయి భర్త మీద కన్ను వేయడం తప్పు అని చెప్పాను అంటాడు.సరే నువ్వు రెస్ట్ తీసుకో మేము కాసేపు అలా బయటకు వెళ్లి తినడానికి ఏదన్నా తెస్తాం అని కార్తీక్, శివ ఇద్దరు అక్కడి నుంచి వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే మోనిత తెగ సంబరపడుతుంది.
పుట్టినరోజు నాడు బాధలో హిమ :
సీన్ కట్ చేస్తే ఇక మరునాడు హిమ పుట్టిన రోజు అని సౌందర్య, ఆనందరావులు అనాథఆశ్రమానికి హిమని తీసుకుని వెళ్తారు.అయితే హిమ మాత్రం సౌర్యని కలవడానికి వెళ్దాం అంటుంది.కానీ సౌందర్య, ఆనందరావులు వద్దమ్మా మనం వెళ్లినా సౌర్య రాదు ఇప్పుడున్న కాస్త సంతోషం కూడా పాడవుతుంది’ అని నచ్చజెబుతారు. హిమ బాధపడుతూనే సరే అంటుంది..మరోవైపు చీక్ మంగుళూర్ లో ఉన్న దీప గుడికి వెళ్లి పిల్లల పేర్ల మీద అర్చన చేయిస్తుంది. అయితే అదే గుడికి సౌర్య, వారణాసి కూడా వస్తారు.
ఒకే గుడిలో కార్తీక్, దీప, సౌర్య:
సౌర్య వారణాసితో ఈ రోజు నా పుట్టిన రోజు అంటుంది. ‘అయ్యో రాత్రి చెప్పకపోయావా సౌర్యమ్మా కేక్ తెచ్చేవాడిని కదా అని హ్యాపీ బర్త్‌డే చెబుతాడు. కానీ సౌర్య మాత్రం బర్త్‌డే మాత్రమే హ్యాపీ లేదు వారణాసి అని నేను ప్రతి బర్త్‌డేకి ఆ దేవుడ్ని ఓ కోరిక కోరతాను అందుకే ఈసారి కూడా వచ్చాను’ అంటుంది సౌర్య దిగులుగా. ఇద్దరూ గుడి లోపలికి వస్తారు. అయితే దీప, సౌర్యలు ఒకరిని ఒకరు చూసుకోరు.మరోవైపు కార్తీక్, మోనితలు కూడా అదే గుడికి వస్తారు.గుడి బయట కారు దిగిన కార్తీక్ ఈ రోజు స్పెషల్ ఏంటి మోనితా? గుడికి తీసుకుని వచ్చావ్ అంటాడు. ‘స్పెషల్ కాదు కార్తీక్ నువ్వు దేవుడు మీద ఒట్టు పెట్టి ఆ వంటలక్కతో మాట్లాడను అని నాకు మాట ఇవ్వాలి అంటుంది.‘ఆగు మోనితా.. అలా ప్రమాణం చేయడం ఎందుకు నేను ఆవిడతో మాట్లాడనులే’ అంటాడు మోనిత చేతిని విడిపించుకుంటూ.
గుడిలో ప్రమాణం చేయనున్న కార్తీక్ :
అప్పుడే కార్తీక్ వాయిస్ దీప చెవిన పడి వాళ్ళను చూస్తుంది.ఆ తర్వాత మోనిత కార్తీక్‌ని బలవంతంగా దేవుడి దగ్గరకు తీసుకుని వెళ్లి పూజారితో హారతి వెలిగించి తీసుకుని రండి ఈయన ఒక ప్రమాణం చేస్తారు’ అంటుంది మోనిత. పూజారి లోపలికి వెళ్తాడు. దీప వాళ్లని ఫాలో చేస్తూ దూరం నుంచి మోనిత ప్లాన్ తెలుసుకుంటుంది.ఇంతలో పూజారి హారతి తెస్తాడు. ఆ వంటలక్కతో మాట్లాడను అని ప్రమాణం చెయ్ కార్తీక్ అంటుంది మోనిత. సరే అని కార్తీక్ చేయి లేపుతాడు.సరిగ్గా అప్పుడే ఆగండి డాక్టర్ బాబు అంటూ ఎంట్రీ ఇస్తుంది దీప. నువ్వా మళ్ళీ ఎందుకొచ్చావ్? అంటూ గొడవకు దిగబోతుంది మోనిత.
మోనిత బండారం బయట పెట్టిన దీప :
ఆగండి డాక్టర్ బాబు మీరు ప్రమాణం చెయ్యాల్సినంత తప్పు నేనేం చేయలేదు.ఇంకా మీకు నమ్మకం లేకపోతే.. ఈ రోజు నా పిల్లల పుట్టిన రోజు వాళ్ల మీద ప్రమాణం చేసి చెబుతాను నేను మోనితకి ఇచ్చిన టిఫిన్‌లో ఏ మందు కలలేదు అంటూ పూజారి చేతిలో ఉన్న హారతిపై ప్రమాణం చేసి దీపం ఆర్పుతుంది. ఇప్పుడు నమ్ముతారా డాక్టర్ బాబు అంటుంది దీప. ఇక మోనిత మాత్రం ఇది అబద్దాన్ని నిజం చేయడానికి దేవుడు ముందు ప్రమాణంచేయడానికి కూడా సిద్ధపడిపోయింది చూశావా కార్తీక్ అంటుంది మోనిత. దీప మాత్రం అవునా దేవుడి మీద ప్రమాణం చేసి అబద్దం చెప్పడం అంత సులభమా..అయితే నువ్వే ప్రమాణం చెయ్ అంటుంది దీప.
సౌర్యను చూసిన మోనిత :
వెంటనే మోనిత షాక్ అయ్యి హాస్పెటల్లో జాయిన్ కావడం నిజమే కదా.? ఇంక నేను ప్రమాణం చేయడం ఏంటీ?’ అంటూ సౌర్యను చూసి షాక్ అయిపోతుంది. దేవుడా.. సౌర్య ఇక్కడుందేంటీ? నా కార్తీక్‌ని నాకు దూరం చేయడానికి ఒక్కక్కరుగా ఇక్కడికే వస్తున్నారా..అర్జెంట్‌గా మకాం మార్చేయాలి’ అనుకుంటుంది మనసులో. కార్తీక్ మాత్రం ఏంటి మోనిత మాట్లాడకుండా దిక్కులు చూస్తావేంటీ? ఆవిడ అన్నదానిలో కూడా నిజం ఉంది మాట్లాడు’ అంటాడు కార్తీక్. మోనిత దిక్కులు చూడటంతో దీపకు అనుమానం వచ్చి సౌర్య ఉన్నవైపే తిరిగి చూస్తుంది. మరి దీపకు సౌర్య కనిపిస్తుందో లేదో అనేది తర్వాత ఎపిసోడ్ లో చూడాలి.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!