Telugu TV Serials

ఈసారి దీప వేసే ప్లాన్ కు మోనిత దిమ్మతిరగడం ఖాయం..!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1454 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న సెప్టెంబర్ 10 న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో కార్తీక్ ను కాపాడిన విషయం డాక్టర్ వాళ్లకు చెప్తుంది దీప. అదే సీన్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. డాక్టర్ బాబు ఎప్పటికన్నా నాకు దగ్గర అవుతాడు అనే నాకు నమ్మకం ఉందమ్మా అంటుంది దీప.ఇప్పుడు డాక్టర్ బాబుకి నీ మీద కోపం పోయినట్లే కదా?’ అంటాడు డాక్టర్. ‘పూర్తిగా కోపం పోయింది అన్నయ్యా. నా మీద నిందలు వేసినందుకు గుడిలో మోనిత చేత సారీ చూడా చెప్పించారు’ అంటుంది దీప. ‘వెరీ గుడ్ అమ్మా సారీ చెప్పడంతో ఆగకూడదమ్మా కాళ్లు పట్టించుకునే రోజు కూడా రావాలి అంటాడు డాక్టర్.

దీప గురించి భయపడుతున్న డాక్టర్ తల్లి :

అలాగే భోజనంలో నువ్వు ఏదో కలిపావని నాటకం ఆడినట్లు.. నిన్ను ఇంకేదో చేస్తుందని భయంగా ఉందమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు’ అంటుంది డాక్టర్ తల్లి.అది నన్ను ఏమి చేస్తుందిలే అమ్మా అంటుంది.సర్లే అమ్మా రేపు వినాయకచవితికి ఇక్కడే ఉండి పూజ చేసుకోమ్మా’ అంటుంది డాక్టర్ తల్లి. ‘లేదమ్మా.. ఆయన్ని పూజకు రమ్మని పిలిచాను.. డాక్టర్ బాబు కూడా వస్తాను అన్నారు.. నేను అక్కడికే వెళ్తున్నా’ అంటుంది దీప.

శివ చెంప పగలకొట్టిన మోనిత :

ఇక మోనిత కార్తీక్ అన్న మాటల్నే గుర్తు చేసుకుంటూ రగిలిపోతుంది.ఇంతలో శివ పరుగున వచ్చి మేడమ్ దీపక్క ఇక్కడే ఉంది ఆమె ఇంటి తలుపు తీసే ఉంది అంటాడు. వెంటనే మోనిత శివ చెంప పగలగొడుతుంది. ‘దీపక్క ఏంట్రా? నా తిండి తింటూ దాన్ని అక్క అంటావేంట్రా?’ అంటుంది మోనిత కోపంగా.అయ్యో మేడమ్ మీరే కదా వంటలక్క అంటారు.నేను పేరు మార్చి దీపక్క అన్నాను అంతే కదా అంటాడు శివ.ఇంకెప్పుడు ఇలా పిలవద్దు అని చెప్పి ఇద్దరు కలిసి దీప ఇంటికి వెళ్తారు.గుమ్మం దగ్గర మామిడి ఆకులు కడుతున్న దీపని చూస్తూ దీపక్కా అంటూ పిలుస్తూ మెట్లు ఎక్కుతుంది మోనిత. శివ షాక్ అయ్యి నేను అక్కా అంటే కొట్టింది మరి ఈవిడ అలా ఎందుకు పిలుస్తుందో? మేడమ్ పెద్ద తేడాగా ఉంది అనుకుంటాడు మనసులో.

మా ఇంట్లో పండగ చేసుకుందాంరా అని దీపను పిలిచిన మోనిత :

ఇక మోనిత వెటకారంగా ఏంటక్కా పండగ మొత్తం నీ ఇంట్లో ఉన్నట్టుంది’ అంటుంది దీపతో పండుగ చేసుకునే టైమ్ వచ్చింది చెల్లీ అంటుంది దీప నవ్వుతు.ఏంటి ఇలా వచ్చావ్ ఏదో కారణం లేకుండా ఊరికే రావు.. విషయం చెప్పు..’అంటుంది దీప మోనితతో.రేపు వినాయక చవితి కదా మా ఆయన అదే నా కార్తీక్.. నిన్ను పిలవమని చెబితే వచ్చాను అంటుంది మోనిత. ‘ఆయన పిలిచారని కాదు కానీ.. నువ్వు కష్టపడి మరీ వచ్చి పిలిచావ్ కదా వస్తా అంటుంది.‘నా కార్తీక్ నాతో కలిసి పూజ చేస్తుంటే నువ్వు చూసి ఏడవాలి అంటుంది మోనిత.

దీప సరికొత్త ప్లాన్ తో మోనితకు చుక్కలు కనిపిస్తాయేమో?


నా కార్తీక్ నాకే సొంతం అని నీకు తెలియాలి’ అంటూ మోనిత దీపను రెచ్చిపోతుంది. ‘అయ్యో.. డాక్టర్ బాబుని నా భర్త అని నిరూపించి లాక్కోవడం నాకెంత సేపు చెప్పు? మా పెళ్లి ఆధారాలు,అత్తయ్యా మావయ్యా వీళ్లంతా వచ్చేలా చేయడం ఎంత సేపు మోనిత..కానీ నాకు కావాల్సింది అది కాదు.డాక్టర్ బాబు తనంతట తానుగా నాదగ్గరకు రావడం అంటుంది దీప.అది జరగదు.. జరగనివ్వను అంటుంది మోనిత.మరి దీప కార్తీక్ వాళ్ళ ఇంటికి పూజ చేయడానికి వెళ్తుందా… లేక కార్తీక్, మోనిత ఇద్దరు కలిసి పూజ చేస్తే చూస్తుందా అనేది వేచి చూడాలి.


Share

Related posts

బావ నువ్వంటే ఇష్టం…అని సౌర్య అంటే తనని పెళ్లి చేసుకుంటా అంటున్న నిరూపమ్..!

Ram

Intinti Gruhalakshmi: ప్రేమ్ తో డీల్ మాట్లాడిన అభి..! నందుకు షాక్ ఇచ్చిన లాస్య..!

bharani jella

నందుకి సవాల్ విసిరిన తులసి.. వసుధార, సాక్షికి బోనం గురించి చెప్పిన తులసి..!

bharani jella