Categories: Telugu TV Serials

సౌర్యను ఎత్తుకున్న నిరూపమ్… హిమ ప్లాన్ వర్కౌట్ అయిందిగా..!!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో స్వప్నకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పంపిస్తుంది.సౌర్య మాట్లాడిన మాటలకు సౌందర్య, ఆనందరావులు కూడా వంత పడతారు. ఇదే క్రమంలో నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి. సౌర్యకు తలనొప్పిగా ఉందని ఒకచోట కూర్చుంటుంది. సౌర్య తలనొప్పిని గ్రహించిన హిమ అమృతాంజనం తీసుకొచ్చి రాస్తుంది. ముందు సౌందర్య అనుకుని నువ్వు సేవలు చేయడం ఏంటి నానమ్మా అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడున్నది హిమ అని తెలిసి కోప్పడి బయటకు పొమ్మంటుంది. నన్ను బయటకు వెళ్లమంటే డాక్టర్ సాబ్ ని లోపలకు పంపిస్తాను అంటూ నవ్వుతూ వెళ్లిపోతుంది.ఏంటి ఈ తింగరి తిట్టినా నవ్వుతూ వెళుతోంది.మళ్ళీ ఏమైనా ప్లాన్స్ వేస్తోందా అనుకుంటుంది శౌర్య మనసులో.

తాతయ్యతో కలిసి జాగింగ్ కి వెళ్లిన సౌర్య:

సీన్ కట్ చేస్తే ఆనందరావు జాగింగ్ కి వెళ్ళటానికి రెడీ అవుతాడు.సౌర్యను కూడా జాగింగ్ కు రామ్మా అని పిలుస్తాడు ఆనందరావు. ముందు కాసేపు బెట్టుచేసినా కార్తీక్ సెంటిమెంట్ వాడేసరికి సరేనంటుంది శౌర్య.ఇద్దరు కలిసి జాగింగ్ కి వెళ్తారు.మరోవైపు సౌందర్య దగ్గరకు వచ్చిన నిరుపమ్ కాఫీ అడిగి అమ్మమ్మ సౌర్య, హిమలు ఇద్దరు ఎలా ఉండేవారని అడుగుతాడు. చిన్నప్పుడు ఇద్దరూ సరదాగా ఉండేవారు ఇప్పుడేంటో ఇలా తయారయ్యారంటుంది.

కోపంలో శోభ… ఐస్ చేసే పనిలో స్వప్న :

సీన్ మళ్ళీ శోభ దగ్గర ఓపెన్ అవుతుంది. శోభ ఏం చేస్తున్నావ్ కాపీ ఎమన్నా కావాలా అని వస్తుంది స్వప్న. కాఫీలు తాగి, టిఫిన్లు తిని, నిద్రపోవడానికి నేను ఇక్కడకు రాలేదు ఆంటీ.నిరుపమ్ తో నా పెళ్లిచేస్తానన్నారు మరిచిపోయారా అంటూ మళ్ళీ మొదలుపెడుతుంది.శోభ నీకు ఏ సమాధానం చెప్పలేకపోతున్నా అంటుంది స్వప్న.

నిరూపమ్, హిమ ఇద్దరు కలిసి జాగింగ్ :

మరోపక్కహిమ బావతో శౌర్య గురించి మాట్లాడాలంటే జాగింగ్ కి వెళ్లాలి అనుకుంటుంది. నిరుపమ్ కూడా హిమతో మనసువిప్పి మాట్లాడాలంటే కుదరడం లేదు అందుకే జాగింగ్ కి రమ్మన్నాలి అనుకుంటాడు. ఇలా ఇద్దరు కూడా కలిసి జాగింగ్ కు వెళ్తారు. మరోపక్క శౌర్య-హిమ కలవాలని దేవుడిని ప్రార్థిస్తుంది సౌందర్య. ఈ లోగా అక్కడకు వచ్చిన ప్రేమ్ వీళ్లంతా ఏరి అని అడుగడంతో అందరు జాగింగ్ కి వెళ్లారని చెబుతుంది సౌందర్య. ఇక ప్రేమ్ మాత్రం మనసులో నిరుపమ్-శౌర్యఎలాగైనా కలవాలి,హిమతో నా పెళ్లిజరగాలని దేవుడిని కోరుకుంటాడు.

సౌర్యను ఎత్తుకున్న నిరూపమ్ :

ఇక హిమ, నిరుపమ్ జాగింగ్ చేస్తుండగా ఓ దగ్గర పెద్ద గుంపు ఉండడంతో ఏమైందంటూ అక్కడకు వెళతారు. వెళ్లి చూసేసరికి శౌర్య కళ్లు తిరిగి పడిపోయి ఉంటుంది. అప్పుడు నిరుపమ్ శౌర్యను ఎత్తుకుని ఇంటికి తీసుకొస్తాడు. నిరుపమ్ బావ తనని ఎత్తుకున్న విషయం శౌర్యకి తెలియాలని హిమ మనసులో అనుకుంటుంది. అనుకున్నట్టే సౌర్య కళ్ళు తెరిచి నిరూపమ్ ను చూస్తుంది. శౌర్య కళ్లు తెరవడం చూసిన నిరుపమ్ కిందకు దించాలనుకుంటాడు. అయితే శౌర్య మాత్రం అప్పుడు మీరు మత్తులో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఇంటికి దింపాను ఇప్పుడు మీరు. కూడా నన్ను ఇంటివరకూ దింపండి చెల్లుకు చెల్లు అంటుంది.

 


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

14 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago