Categories: Telugu TV Serials

సౌర్యను మరోసారి ఏడిపించిన నిరూపమ్.. ఆనందంలో హిమ, ప్రేమ్..!

Share

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు. తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో సౌర్యను శోభ కిడ్నాప్ చేయించడంతో నిరూపమ్ సౌర్య ఆచూకీ తెలుసుకుని ఆ రౌడీల బారి నుండి సౌర్యను కాపాడతాడు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.రౌడీలు పారిపోతూ డోర్ బయట గడియపెట్టి పారిపోతారు. నిరూపమ్ వాళ్ళు ఉన్న లొకేషన్ ను ప్రేమ్ కు పంపగా ప్రేమ్, హిమలు అక్కడికి చేరుకుంటారు.డోర్ తీయమని నిరుపమ్, శౌర్య లోపల నుంచి అరుస్తుండగా ప్రేమ్ మాత్రం బయట లాక్ వేసి ఉంది పగలగొట్టాలని అబద్ధం చెబుతాడు.

గదిలో ఒంటరిగా నిరూపమ్, సౌర్యలు :

వాళ్లిద్దరి మధ్య ఉన్న అపార్ధాలు పోయింది ఫ్రెండ్ షిప్ కుదరడానికి ఇదే మంచి సమయం అని హిమకు చెబుతాడు.ఇక సౌర్య మాత్రం తాళం కూడా పగలగొట్టడం రాదా అని అరుస్తుంది.ఈ రోజు తాళం రాకపోతే మీ ఇద్దరూ రూమ్ లో మేం బయట అంటాడు. ఏదో ఒకటి చేసి మమ్మల్ని విడుదల చేయండిరా అంటాడు నిరుపమ్..ప్రేమ్  ఓ రాయి తీసుకొచ్చి కావాలనే గొళ్లెంపై కొడుతుంటాడు. హిమ అది చూసి నవ్వుకుంటుంది.

సౌర్య దొరకడంతో ఆనందంలో సౌందర్య, ఆనందారావు :

సీన్ కట్ చేస్తే శౌర్య కోసం కంగారుపడుతుంటారు సౌందర్య, ఆనందరావు. ఈ లోగా హిమ కాల్. చేసి శౌర్య క్షేమంగా ఉందని చెప్పడంతో ఇద్దరు హమ్మయ్య అనుకుంటారు.ఈరోజుకి మీరిద్దరూ లోపలే ఉండండి అంటారు ప్రేమ్, హిమలు. ఇక లోపల ఉన్న సోర్యతో నిరుపమ్ ఎవరు వాళ్ళు అని అడగగా జరిగిన విషయం చెబుతుంది సౌర్య.అంతా విన్న నిరూపమ్ వావ్ నువ్ సూపర్ శౌర్య..ధర్యే సాహసే శౌర్య అంటాడు.మరోపక్క శోభ కోపంతో రగిలిపోతుంది. ప్లాన్ ఇలా బేడీసికొట్టింది ఏంటి అనికోపంతో రగిలిపోతుంది.ఇక నిరూపమ్, సౌర్య ఎవరికి వారు కూర్చుంటారు.సౌర్య మనసులో ఆకలేస్తోందని అనుకుంటుంది. ఇంతలో నిరూపమ్ ఆకలేస్తోందా అని అడుగుతాడు.బయట ఉన్న హిమకుడా లోపలున్నవాళ్లకి ఆకలేస్తోందేమో బావా అనుకుంటూ ఏం కావాలని అడుగుతుంది. ఏదైనా తీసుకురారా అంటాడు నిరూపమ్. కాసేపు మౌనంగా కూర్చున్న నిరుపమ్ అలాగే సోఫాలో పడుకుంటాడు.

సౌర్యను మళ్ళీ ఏడిపించిన నిరూపమ్ :

వామ్మో దోమలున్నాయంటూ లేస్తాడు.సౌర్య ఏమి మాట్లాడకపోయేసరికి నీకు దోమలు కుట్టడం లేదా అంటాడు.ఇలాంటి ప్లేస్ లో దోమలు కాకుండా సీతాకోక చిలకలు ఉంటాయా అంటు వెటకారంగా మాట్లాడుతుంది.ఇంతలో ప్రేమ్ వచ్చి వెజ్ బిర్యానీ తీసుకొచ్చాను తీసుకో అంటాడు.మరో ప్యాకెట్ ఏదని నిరుపమ్ అడిగితే ఈ టైమ్ లో ఏది దొరకడమే కష్టం మళ్ళీ ఇంకోట అని మీరిద్దరూ షేర్ చేసుకోండి అంటాడు.కింద కూర్చుని బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేస్తుంది శౌర్య. కాస్త దూరంగా కూర్చుంటాడు నిరుపమ్. సౌర్యకు ఉన్నటుండి పోలమారడంతో నిరూపమ్ వచ్చి సౌర్య తలపై మెల్లగా కొట్టి మంచినీళ్లు తాగిస్తాడు. ఇక
రేపటి ఎపిసోడ్ లో మాత్రం.
నిరుపమ్ సోఫాలో నిద్రపోతుండగా సౌర్య వచ్చి దుప్పటి కప్పుతుంది..మీరు అడ్జెస్ట్ కాలేరు కదా అని. సౌర్య అంటే నీ ప్లేస్ లో హిమ ఉంటే ఇంతకన్నా దారుణమైన ప్లేస్ లో అయినా అడ్జెస్ట్ అవగలను అంటాడు. అవును నా ప్లేస్ హిమ తీసుకుంది కదా అనుకుంటూ పాపం ఏడుస్తూ నేలపై పడుకుంటుంది శౌర్య.

 

 

 

 


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

29 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

38 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago