Categories: Telugu TV Serials

సౌందర్య దెబ్బకు బేంబేలెత్తిపోయిన హిమ, శోభ, స్వప్న… ముగ్గురు నోటా నో సౌండ్..!!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ సరికొత్త కథనంతో 1424 వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. హిమ బావను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అనడంతో సౌందర్య కోపంతో హిమ చెంప చెల్లు మనిపిస్తుంది. హిమని నోరు ఎత్తనివ్వకుండా చెసింది..ఇంతలో ఈవెంట్ మేనేజర్ రావడంతో అతడిని చూస్తూ ‘పనుల్నీ నేను చెప్పిన ప్రకారం జరిగిపోవాలి ఏది తేడా వచ్చినా ఊరుకునేది లేదు’ అంటుంది సౌందర్య. సౌందర్య మాటలు సౌర్య విని బాధపడుతుంది.

ప్లాన్ అమలుచేసిన స్వప్న, శోభలు :

Karthika Deepam August 03 Episode: నిరూపమ్ ను కాదని ప్రేమ్ ప్రేమను హిమ ఒప్పుకుంటుందా..??

సీన్ కట్ చేస్తే స్వప్న దగ్గరకు శోభ వెళ్లి ఏంటి ఆంటీ ఇది వాళ్ళు పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారట అంటుంది కంగారుగా. ‘పెళ్లి పనులు మొదలుపెట్టినంత మాత్రాన్న పెళ్లి జరిగిపోతుందా శోభా? దాన్ని కచ్చితంగా ఆపి తీరదాం’ అంటుంది స్వప్న. ఇంతలో ప్రేమ్, సత్యం అటుగా రావడం గమనించిన శోభ.. ‘ఆంటీ ఇలా అయితే ఎలా..? తినకుండా ఉంటారేంటీ మీరు.మీరు ఇలా కడుపు మాడ్చుకుంటే పెళ్లి ఆగిపోతుందా? రెండు రోజులు నుంచి మీరేం తినట్లేదు’ అంటూ డ్రామా స్టార్ట్ చేస్తుంది. అంతా విన్న సత్యం, ప్రేమ్ కంగారు పడతారు..ప్లీజ్ మమ్మీ నువ్వు అలా ఆలోచించకు. అందరం కలిసి నిరుపమ్ మనసు మారుద్దాం నువ్వు తినకుండా ఉండకు ఏదోటి చేసి పెళ్లి ఆపుదాం లే’ అంటాడు ప్రేమ్. అయినా స్వప్న మాట వినదు.ఇక సత్యం సౌందర్య ఇంటి వెళ్లి ‘మీ మమ్మీ తిండీ తిప్పలు మానేసి కూర్చుందిరా’ అంటూ నిరుపమ్‌కి చెబుతాడు. నేను రాను డాడీ.. కావాలనే మమ్మీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది’ అని తెగేసి చెబుతాడు నిరుపమ్. దాంతో సత్యం ఇంటికి వచ్చి స్వప్నతో.. ‘నిరుపమ్ మన మాట వినేలా లేడు నువ్వు తిను.. ఆరోగ్యం పాడైపోతుంది’ అంటూ బతిమలాడతాడు. అయినా గాని స్వప్న వినకుండా ఎలాగయినా వాడి పెళ్లి శోభతో చేస్తాను అంటుంది.

సౌర్యను పెళ్లి చేసుకోమని నిరూపమ్ ను అడిగిన హిమ :

ఇక నిరుపమ్ బాధగా కూర్చుని ఉంటే హిమ వెళ్లి సౌర్యకు మంచి జీవితాన్ని ఇవ్వు బావా.. చిన్నప్పటి నుంచి తను ఎన్నో కోల్పోయింది.తనకి నువ్వే జీవితాన్ని ఇవ్వాలి బావ అంటూ రిక్వస్ట్‌గా మాట్లాడుతుంది. ‘హిమా.. నేను సౌర్య మనసుని బాధపెట్టాలనే కిడ్నాప్ తర్వాత గదిలో ఉన్నప్పుడు హిమతో ఉంటే ఎక్కడన్నా ఆనందంగా ఉంటాను అని అప్పుడన్న మాటల గురించి చెప్తాడు.అలా ఎందుకు చేశావ్ బావా’ అంటుంది హిమ బాధగా. ‘అప్పుడే సౌర్య మనసులోంచి పూర్తిగా నన్ను తీసేస్తుందని అలా చేశాను హిమా.. నువ్వు సౌర్య జీవితం గురించి ఆలోచిస్తున్నావ్.. కానీ నా ఆశలు గురించి ఆలోచించడం లేదు అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్.

నిరూపమ్ ను ఇంటికి వెళ్లకుండా ఆపిన సౌందర్య:

మరునాడు ఉదయాన్నే నిరుపమ్ స్వప్నని చూడటానికి ఇంటికి బయలుదేరతాడు. నిరుపమ్ కారు తీయడం చూసిన సౌందర్య ఏంట్రా అంటూ నిరుపమ్‌ని ఆపుతుంది. ఇంతలో హిమ కూడా ‘ఆగు బావా’ అంటూ పరుగున వస్తుంది.మీ అమ్మతో భోజనం చేయించే బాధ్యత నాది నువ్వు లోపలికి వెళ్లు’ అంటుంది సౌందర్య. దాంతో నిరుపమ్ లోపలికి వెళ్లిపోతాడు అంతా మెడ పైనుంచి చూస్తున్న సౌర్య ఆహా ఓ నాన్నమ్మ.. ఓ తాతయ్య.. ఓ బావ,అద్భుతమైన ప్రేమలు,అంతా హ్యాపీగానే ఉన్నారు కదా ఇక్కడ నేను అవసరమా?’ అనుకుంటుంది బాధగా.

శోభ చెంప పగలకొట్టిన సౌందర్య:

ఇక సత్యం టిఫిన్ తింటూ ఉంటే శోభ వచ్చి వెటకారంగా తినండి అంకుల్ బాగా తినండి. అవతల ఆంటీ తిండీ,నిద్ర లేకుండా ఉంటే మీరు మాత్రం బాగా తినండి’ అంటూ పెత్తనం చేస్తూనే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. ఇంతలో శోభ చెంప చెల్లుమంటుంది. ఎవరా అని తిరిగి చూస్తే సౌందర్య ఉంటుంది. నన్ను ఎందుకు కొట్టారు?’ అంటుంది శోభ “నా కూతురు ఇంట్లో నీ పెత్తనం ఏంటే?’ అంటుంది సౌందర్య. ఇంతలో స్వప్న వచ్చి నాకు కాబోయే కోడల్ని కొడతావా మమ్మీ?’ అంటుంది.ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా కొడతాను అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

4 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago