బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో హిమతో నిరూపమ్ పెళ్లి జరగడం గారంటీ అంటూ సౌందర్య స్వప్న, శోభలకు సవాల్ విసురుతుంది. మరో పక్క నిరూపమ్, హిమల పెళ్లి ఆపడం కోసం హిమ, ప్రేమ్ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి. మరి ఈరోజు ప్రసారం కానున్న కార్తీకదీపం సీరియల్ 1425 లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..
స్వప్న మాటలకు కోపంతో ఉగిపోయిన నిరూపమ్ :
నిరుపమ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి శోభ కి, స్వప్నకి ఇద్దరికీ గట్టిగా క్లాస్ పీకి హిమని ఎలా అయినా పెళ్లి చేసుకుని తీరతాను అంటూ చెప్పి సౌందర్య ఇంటికి వస్తాడు. ఇంతలో స్వప్న, శోభ పెళ్లి కార్డులు తీసుకొని సౌందర్య ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చే సమయానికి నిరుపమ్ అమ్మమ్మ, తాతయ్యల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు. అది చూసిన స్వప్న నిరూపమ్ ను ఆదిదంపతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నావా అంటుంది. అలాగే సింగిల్ గా ఎందుకు రా..నీ కాబోయే భార్యతో కలిసి తీసుకో పోయావా అంటూ వెటకారంగా అంటుంది స్వప్న. అప్పుడు నిరుపమ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా మమ్మీ అని అంటాడు. స్వప్న నాకు అంత అర్థమవుతుంది.అయినా నువ్వు అనుకున్నంత మంచోళ్ళు ఏమి కాదు మీ అమ్మమ్మ ,తాతయ్య వాళ్లు పైకి అలా కనిపిస్తారు. వాళ్ళ మాయలో. పడిపోయావ్ నువ్వు. వాళ్ళ లోపల అంతా శాడిజం ఉంటుంది అని అంటుంది స్వప్న.
శోభ, నిరూపమ్ ల పేరుతో ఇన్విటేషన్ తెచ్చిన స్వప్న :
ఇక స్వప్న తన చేతిలో ఉన్న పెళ్లి శుభలేఖను సౌందర్య చేతిలో పెడుతుంది. ఆ శుభలేఖలో శోభ, నిరూపమ్ ల పేరు మీద కార్డు కొట్టించి ఉంటుంది.అప్పుడు సౌందర్య ఆ కార్డు చూసి కోపంతో చింపి వేస్తుంది.మమ్మీ నువ్వు కార్డు చింపినంత మాత్రాన వాళ్ల పెళ్లి ఆగిపోతుంది అనుకుంటున్నావా…నేను నిరుపమ్ , శోభల పెళ్లి చేసి తీరుతాను అంటుంది.నువ్వు పెట్టిన ముహూర్తానికి మీ ఇంట్లోనే మీ అందరి ముందు జరిపిస్తాను అని గట్టిగా శబదం చేస్తుంది. స్వప్న మాటలకు నిరుపమ్ నువ్వెందుకు మమ్మీ పిచ్చి దానిలాగా చేస్తున్నావు. నా జీవితంతో ఆడుకుంటున్నావు. నాకు ఇష్టంలేని పెళ్లి ఎందుకు చేస్తున్నావు అంటాడు.నేను ఇష్టపడింది హిమని నేను హిమానే పెళ్లి చేసుకుంటాను అని నిరూపమ్ స్వప్నతో అంటాడు.
స్వప్నకు సవాల్ విసిరిన సౌందర్య:
కోపంలో సౌందర్య అది ఇలాంటి ఎన్ని పిచ్చి వేషాలు వేసిన మీ పెళ్లి జరిపించడానికి నేనున్నా మనవడా అని అంటుంది. మీరేం చేసుకుంటారు చేసుకొండి అంటుంది. ఎవరు ఏన్ని చేసిన ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని అంటుంది సౌందర్య. ఇక్కడ జరిగే తతంగం అంతా చూస్తూ సౌర్య బాధపడిపోతూ ఉంటుంది.
పెళ్లి ఆపడానికి ప్రేమ్, హిమలు వేసిన ప్లాన్ :
సీన్ కట్ చేస్తే ప్రేమ్,హిమలకు ఈ విషయం గురించి ఏదోటి చేయాలి అని ఒక ప్లాన్ వేస్తారు. కట్ చేస్తే సౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఫోటో దగ్గరికి వెళ్లి ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది. అందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు. నన్ను మోసం చేస్తున్నారు అంటూ బాధ పడుతుంది.. నేను వెళ్లి పెళ్లి చూసి సంతోష పడిపోవాలా అని అనుకుంటూ,నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను అని డిసైడ్ అయ్యి గట్టిగా అరుస్తూ బాధపడుతూ ఉంటుంది.
పెళ్లి ఏర్పాట్లు చూసి బాధలో సౌర్య:
సౌందర్య పెళ్ళికి కావలసిన ఏర్పాట్లను చూసుకుంటూ ఉంటుంది. అక్కడ శోభని ,స్వప్న పెళ్లికూతురుగా రెడీ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ప్రేమ్ హిమలు, సౌర్యకు నచ్చజెప్పి నిరుపమ్,సౌర్యల పెళ్లి చేయాలి అని డిసైడ్ అయ్యి శౌర్య దగ్గరికి వచ్చి తనని నిరుపమని పెళ్లి చేసుకోమని కన్విన్స్ చేస్తూ ఉంటారు.