Telugu TV Serials

స్వప్న బ్లాక్ మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

Share

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో ఏమైందో ముందుగా తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో నిరూపమ్ నేను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి జరిపించే బాధ్యత నీది అని. సౌర్యను అడగగా సరే అని సౌర్య మాట ఇస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో హిమకు సౌందర్య కోను పెడుతూ ఉంటుంది. హిమ మౌనంగా ఉండటాన్ని గమనించిన ఆనందరావు మాట కలుపుతాడు. ఆ సమయంలో హిమ ఏడుస్తుంది. ‘సౌర్య కోరిక తీరకుండా పోతుంది’అని బాధపడుతుంది.నీకు పెళ్లి అయ్యి నాలుగు రోజులు గడిస్తే అంతా సెట్ అవుతుంది’ అని ధైర్యం చెబుతుంది సౌందర్య.అయినా సరే సౌర్య పెళ్లి చేసి తీరాతాను అనేసి హిమ అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతుంది.

అత్త కోడళ్ల అనుబంధం :

సీన్ కట్ చేస్తే స్వప్న శోభకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శోభ చేతులకు కోన్ పెట్టుకుని ఉండటంతో స్వప్న శోభకు తినిపిస్తు ఇద్దరు మురిసిపోతూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. అప్పుడే సౌర్య వచ్చి వాళ్ళ అనుబంధాన్ని చూసి చప్పట్లు కొడుతుంది. స్వప్న,శోభ షాక్ అయ్యి పైకి లేస్తారు. ‘ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో.. ఇలాంటి అత్తాకోడళ్లని చూశాను.కాబోయే కోడలికి ప్రేమగా తినిపిస్తున్న అత్త. మీరు సూపర్ అంటూ వాళ్ళని వెటకారంగా పొగుడుతుంది. సౌర్య. ‘హేయ్ నువ్వు ఎందుకొచ్చావే’ అంటుంది స్వప్న. ‘ఏంటి అత్తా అలా అంటావ్.? ఇంట్లో పెళ్లి పెట్టుకుని.. మేనకోడల్ని వస్తే ఎందుకు వచ్చావ్ అంటావ్ అంటూ స్వప్న చేతిలోని కంచెం తీసుకుని అన్నం కలిపి శోభకు తనే బలవంతంగా తినిపిస్తుంది. చూడు శోభా ఇల్లు అలకగానే పండుగ కాదు అంటారు చూడు. జీవితం అన్నాక ఎన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటీ? కాదు కదా అంటుంది సౌర్య.శోభా నువ్వు ఈ ఇంటి కోడలిగా ఎప్పటికీ రాలేవు..’ అంటుంది సౌర్య. ‘ఈ పెళ్లి జరుగుతుంది. శోభే నా ఇంటి కోడలు అవుతుంది’ అంటుంది స్వప్న. ఇలా ఇద్దరు సవాల్ విసురుకుంటారు.

సౌందర్య ఇంట్లో పెళ్లి పనులు మొదలు :

 

ఇక సౌందర్య ఇంట్లో పెళ్లి బాజాలు మొదలైపోతాయి. చుట్టాలు అంతా వస్తూ ఉంటారు.ఇక సౌందర్య ఆనందరావు కంగారు పడడం చూసి ఏమి కాదండి సౌర్య నిరుపమ్‌కి మాటిచ్చిందట.. హిమతో పెళ్లి చేస్తాను అని’ అంటుంది. దాంతో ఆనందరావు సంతోషిస్తాడు.

స్వప్న రాసిన లేఖ :

సీన్ కట్ చేస్తే.. నిరుపమ్ కోపంగా ఇంట్లో ఉంటే స్వప్న, సత్యం నిరుపమ్ దగ్గరకు వెళ్తారు. నిరుపమ్‌ మనసు మార్చడానికి స్వప్న చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది.శోభని పెళ్లి చేసుకో అంటే నో అంటాడు నిరుపమ్. పెళ్లి కొడుకుగా రెడీ అవ్వుతావో లేదో.. ఈ లేఖ చదివి పెళ్ళికి ఒప్పుకుంటావో నువ్వే నిర్ణయించుకో అంటుంది స్వప్న. వెంటనే నిరుపమ్ స్వప్న చేతిలోని లేఖని అందుకుని చదువుతాడు. ‘మమ్మీ ఏంటిది?’ అంటూ కోపంగా అరుస్తూ ఏమి. చేయలేని నిస్సహయంగా నిలబడిపోతాడు.

పెళ్ళి ఆపడానికి సౌర్యకు దొరికిన ఆధారం :

ఇక సరిగ్గా అప్పుడే సౌర్య ఆటో మీద ఓ చోటకి వెళ్లి ఓ ఇంటి తలుపు తడుతుంది. తలుపు తీయగానే ఎవరో దొరికావ్ అన్నట్లుగా ఓ ఎక్స్‌ప్రెషన్ పెడుతుంది సౌర్య.అది ఎవరు అనేది చూపించకపోయినా పెళ్లి ఆపడానికి శోభకు సంబంధించిన ఏదో ఆధారం అని తెలుస్తుంది. మరోవైపు నిరుపమ్ పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి కిందకి వస్తాడు. నిరూపమ్ ను చూసి మురిసిపోతుంది స్వప్న. ‘నాకు తెలుసురా నీ మనసు ఈ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం. అంటూ పొంగిపోతుంది.


Share

Related posts

Intinti Gruhalakshmi: తులసి డబ్బులు కాజేసింది లాస్యేనని తెలుసుకుంటుందా.!? తులసి పై నందు ఫైర్..!

bharani jella

Guppedantha manasu: వసు బైక్ ఎక్కిన రిషి…. మరోపక్క వీళ్ళ ప్రేమ బంధానికి అడ్డుగా మారుతున్న అమ్మ అనే అనుబంధం..!!

Ram

Intinti Gruhalakshmi: లాస్య మాములిది కాదుగా.. సామ్రాట్ అడ్డంగా బలి.. హనీ సామ్రాట్ తులసిని కలుపుతుందా.!?

bharani jella