Telugu TV Serials

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తోంది. దీప, సౌర్య ఒకే బస్సులో ప్రయాణం చేస్తారు కానీ ఒకర్ని ఒకరు కలుసుకోరు. ఎవరికీ వారు వేరు వేరుగా హైదరాబాద్ బస్ స్టేషన్ లో దిగిపోతారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే సౌర్య, చంద్రమ్మ, ఇంద్రుడు ముగ్గురు కలిసి ఆటో ఎక్కి సౌందర్య ఇంటికి బయలుదేరతారు. సౌర్య మాత్రం ఇంకా కోపంగానే ఉంటుంది.నేను వెళ్లను అంటే ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నారో తెలియట్లేదు నేను మీకు వద్దు అంటే.. నన్ను వదిలేయొచ్చు కదా..? ఇంటికి తీసుకుని వెళ్లడం ఎందుకు? ఆ హిమతో కలిసి నేను ఎలా ఉండాలి.. నా వల్ల కావట్లేదు’ అంటూ సౌర్య ఏడుస్తుంది ఆటోలో వెళ్తూ. ‘అమ్మా బంగారం నువ్వు మాకు బారం కాదు మా బిడ్డ పోయాక బిడ్డలా నిన్ను చూసుకోవాలని అనుకున్నాం. కానీ నీకు నీ వాళ్లు ఉన్నారని తెలిసి కూడా నిన్ను మా దగ్గరే ఉంచుకుంటే అది స్వార్థం అవుతుంది. నీకు అన్యాయం చేసినట్లు అవుతుంది. ఇప్పుడు కోపంలో ఉన్నావ్ నువ్వు అంతే.. రేపు కోపం తగ్గాక వాళ్ల దగ్గరకు వెళ్లాలనిపిస్తుంది మా మాట విను అని సోర్యకు నచ్చ చెప్పడంతో సౌర్య కాస్త కూల్ అవుతుంది.

ఇల్లు కాళీ చేసి అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం :

సీన్ కట్ చేస్తే దీప కూడా వేరే ఆటో ఎక్కి సౌందర్య ఇంటికి బయలుదేరుతుంది. ఆటోలో వెళ్తూ ‘అత్తయ్యమావయ్యలు, పిల్లలు నన్ను చూసి చాలా సంతోషిస్తారు.ఆయన కూడా బతికే ఉన్నారని తెలిస్తే సంబరంతో మురిసిపోతారు అనుకుంటూ వాళ్ళకి రాత్రంతా నిద్రపోకుండా కబుర్లు చెప్పాలి అనుకుంటుంది.ఇక సౌర్య వాళ్లు సౌందర్య ఇంటికి వస్తారు. ఆటో అబ్బాయిని అక్కడే ఉండమని చెప్పి ముందుగా చంద్రమ్మ, గండా వెళ్లి పాప వచ్చిందని వాళ్లకు చెబుదాం.. ఆ తర్వాత పాపని తీసుకుని వెళ్దాం అనుకుని సౌర్యను ఇక్కడే ఉండమని చెబుతారు. చంద్రమ్మ, ఇంద్రుడు లోపలికి వెళ్లగా వాళ్లని సెక్యూరిటీ గార్డ్ ఆపుతాడు.ఎవరమ్మా మీరు’ అంటాడు సెక్యూరిటీ గార్డ్. ‘మేము ఈ ఇంట్లో వాళ్లని కలవడానికి వచ్చాం..వాళ్ల పాపని తీసుకొచ్చాము. ఆ పాప వాళ్ల నాన్నమ్మ తాతయ్యలు ఇక్కడే ఉంటారు అని అంటాడు ఇంద్రుడు. అంతా విన్న సెక్యూరిటీ వాళ్ళు నిన్ననే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారండి అంటాడు. అప్పటికే సౌర్య ఆ ఇంట్లోని జ్ఞ‌ాపకాలను గుర్తు చేసుకుంటూ ముందుకు వస్తుంది.‘ఎక్కడికి వెళ్లారు అని ఇంద్రుడు అడగగా ఈ ఇల్లు అమ్మేసి అమెరికా వెళ్లిపోయారు’ అంటాడు సెక్యూరిటీ గార్డ్. ఆ మాట సౌర్య చెవిన పడగానే పాపం అల్లాడిపోతుంది సౌర్య. అదేంటి బిడ్డని వదిలేసి వాళ్లు అలా ఎలా అమెరికా వెళ్లిపోతారు గండా?’ అంటుంది చంద్రమ్మ. ‘మెల్లగా మాట్లాడవే పాప విని బాధపడుతుంది’ అంటాడు ఇంద్రుడు. ‘అంతా వినేసిందిగా ఇంకా దాచేది ఏముందిలే అంటూ సౌర్య వెనుక ఆగమ్మా అంటూ పరుగీస్తారు.సరే పదమ్మా మనింటికి వెళ్లిపోదాం అంటే సౌర్య సరే అన్నట్లుగా తలాడిస్తుంది.

కార్తీక్ గురించి తెలుసుకున్న డాక్టర్ :

మరోవైపు దీపని కాపాడిన డాక్టర్, అతడి తల్లి కూర్చుని దీప ఇంటికి చేరుకుని ఉంటుంది అంటావా అని అడుగుతుంది పెద్దావిడ. ‘వెళ్లే ఉంటుందమ్మా ఈ పాటికి వాళ్ళని కలిసిన ఆనందంలో కాల్ చెయ్యలేదు అనుకుంట కుదుట పడ్డాక తనే చేస్తుందిలే’ అంటాడు డాక్టర్. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి సార్ మీరు చెప్పినట్లే ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేశాను.పక్క ఊరి ఆసుపత్రిలో ఓ వ్యక్తిని జాయిన్ చేశారట అతడు కార్ యాక్సిడెంట్ జరిగిన రోజునే దొరికాడట’ అని చెప్పి వెళ్తాడు. దాంతో ఆ పెద్దావిడ అతడు ఆ అమ్మాయి భర్త అయ్యే అవకాశం ఉంది వెంటనే ఈ విషయం తనకి చెప్పు చాలా సంతోషిస్తుంది’ అంటుంది డాక్టర్‌తో.

సౌందర్య ఇంటికి దీప :

ఇక దీప కూడా సౌందర్య ఇంటికి చేరుకుంటుంది.దీపకు కూడా ఆ సెక్యూరిటీ గార్డ్ సౌందర్య వాళ్లు ఇల్లు అమ్మేసి అమెరికా వెళ్లిపోయారు అనే విషయం చెబుతాడు.దాంతో దీప షాక్ అవుతుంది. అయ్యో అమెరికా వెళ్తే నేను వాళ్ళను ఎలా కలుసుకోగలను? భగవంతుడా ఇదేం పరీక్ష అనుకుంటూ వాళ్ళ ఫోన్ నంబర్ ఏదైనా ఉందా? అంటుంది ఆశగా. నాకేం తెలియదమ్మా ఈ ఇల్లు అమ్మేసి వాళ్లు వెళ్లిపోయారు అంటాడు.అతడి సమాధానంతో అల్లాడిపోతుంది దీప. సరిగ్గా అప్పుడే డాక్టర్ కాల్ చేసి కార్తీక్ గురించి చెప్పగానే సరే అన్నయ్యా నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను అని పరుగుతీస్తుంది.

కార్తీక్ ను కలిసిన దీప :

ఇక మరుసటి రోజు ఉదయానికి దీప చిక్ మంగుళూర్ వెళ్లిపోతుంది. అక్కడ ఉన్న గుడికి వెళ్లి డాక్టర్ బాబు దొరకాలి.పక్క ఊరిలో ఉన్న ఆ వ్యక్తే నా డాక్టర్ బాబు కావాలి అని దేవుడికి మొక్కుకుంటుంది. అలా మొక్కుకుని నుదుట బొట్టు పెట్టుకుంటూ ఉండగా దీపా అని పిలుస్తాడు డాక్టర్ బాబు. వెంటనే దీప పరుగున వచ్చి కార్తీక్ ను చూసి ఏడుస్తూ హత్తుకుంటుంది.కార్తీక్ కు బొట్టు పెట్టి మీరు వస్తారని నాకు తెలుసు అంటూ అల్లాడిపోతుంది.కానీ అదంతా దీప ఊహ. డాక్టర్ బాబు రాలేదని తెలుసుకుని కుమిలికుమిలి ఏడుస్తుంది. ఆ దేవుడి వైపు తిరిగి చూసి అంటే నా డాక్టర్ బాబు బతికే ఉన్నారని చెప్పడానికే ఇలా నా ఊహల్లోకి వచ్చేలా చేశావా దేవుడా అంటూ పక్క ఊరు ఆసుపత్రికి వెళ్తాను అనుకుంటూ కుంకుమ పొట్లం చెంగుకు కట్టుకుని బయలుదేరుతుంది. దీప అనుకున్నట్టు ఆ వ్యక్తి నిజంగానే కార్తీక్ నా కదా అనేది తరువాత ఎపిసోడ్ లో చూడాలి.


Share

Related posts

Karthika Deepam: హిమ, సౌర్యలకు కాకుండా నిరూపమ్ ను శోభకు ఇచ్చి పెళ్లి చేయనున్న సౌందర్య..!

Ram

సామ్రాట్ వలన మరో సమస్యలో చిక్కుకున్న తులసి.. నందు, లాస్యకి చివాట్లు పెట్టిన తులసి..

bharani jella

Intinti Gruhalakshmi: 24 గంటల్లో 20 లక్షలు నా అకౌంట్ ఉండాలని లాస్యకు వార్నింగ్ ఇచ్చిన తులసి..! 

bharani jella