బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్. రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. గత ఎపిసోడ్ లో కలిసి భోజనం చేద్దాం రా అని హిమను సౌర్య పిలవడంతో హిమ చాలా సంతోషపడుతుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఈరోజు ఎపిసోడ్ కూడా అదే సీన్ తో కంటిన్యూ అవుతుంది.
కలిసి భోజనం చేస్తున్న సౌర్య, హిమలు :
హిమ, సౌర్య కలిసిపోయారు.. కానీ ఎవరు ఊహించని షాక్ ఇచ్చిన నిరూపమ్..!!
ఈ రోజు ఎపిసోడ్ లో హిమను భోజనం చేయడానికి సౌందర్య, ఆనందరావులు ఎంత పిలిచినా కూడా రాకుండా తర్వాత తింటాను అని అంటుంది. అప్పుడు వెంటనే సౌర్య నానమ్మ రమ్మని చెప్పు అని సౌందర్యకీ చెబుతుంది. దాంతో సౌందర్య, హిమ ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు హిమ ఆనందంగా వచ్చి భోజనం చేయడానికి కూర్చుంటుంది. అప్పుడు హిమను నాకు ఎదురుగా నా కళ్ళలోకి చూస్తూ తినమని చెప్పు అప్పుడు నాకు చేసిన ప్రతి ద్రోహం గుర్తుకు వస్తుంది అనడంతో హిమ చాలా బాధపడుతుంది.
ఇద్దరికి ఒకేలాంటి డ్రెస్స్ లు తెచ్చిన సౌందర్య:
మరొకవైపు నిరుపమ్ మాత్రం హిమ ఫోటో వైపు చూస్తూ జరిగిన అన్ని విషయాలు గురించి తలచుకొని బాధపడుతూ ఉంటాడు. హిమ తన మనసులో నా మీద ఉన్న ప్రేమను చంపుకుని కేవలం సౌర్య కోసం త్యాగం చేస్తుంది అని బాధపడతాడు.మరొకవైపు హిమ కూడా సౌర్య గురించి ఆలోచిస్తూ నీకు నిజం ఏప్పటికి తెలుస్తుందో , నా మీద నీకు కోపం ఎప్పుడు తగ్గుతుందో అని ఎమోషనల్ అవుతుంది. ఆ తరువాత సౌందర్య, ఆనంద్ రావ్ లు ఇద్దరు కూడా హిమ, సౌర్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఇప్పుడే ఇద్దరినీ ఒకటి చేయాలి అని ఆలోచిస్తే సౌర్య కోసం మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అని అనుకొని బాధపడుతూ ఉంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆనంద్ రావ్ లు హిమ, సౌర్యల కోసం ఒకే రకమైన బట్టలు తీసుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చి వేసుకోమని చెప్తారు. ఇద్దరు వేసుకుని ఒకరిని ఒకరు చూసుకుంటారు. హిమ మాత్రం చాలా సంతోషం పడుతుంది కానీ సౌర్య మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది.అప్పుడు సౌర్య తాతయ్య ఆనంద రావు తో డ్రెస్సులు ఒకటే అయితే మనసులు కలవాలి కదా చేసిన ద్రోహం మరిచిపోతానా అంటూ హిమ పై సీరియస్ అవుతుంది.
నిరూపమ్,హిమల పెళ్లి జరగదు అంటున్న ప్రేమ్ :
మరోపక్క ప్రేమ్ మాత్రం హిమకు పంపిన సెల్ఫీ వీడియో చూసుకుని బాధపడుతూ ఉంటాడు.స్వప్న మాత్రం రేయ్ ప్రేమ్ నువ్వు నిరుపమ్ విషయం గురించి ఆలోచించావా లేదా అని టెన్షన్ టెన్షన్ గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ వాళ్ళిద్దరికీ ఎట్టి పరిస్థితులలోను పెళ్లి జరగదు అనడంతో స్వప్న సంతోష పడుతూ ఉంటుంది.
నిరూపమ్, హిమలను చూసి కోపంతో ఉగిపోయిన జ్వాల:
మరొకవైపు నిరుపమ్,హిమ రెస్టారెంట్ లో కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి సౌర్య వచ్చి వాళ్ళను చూసి కోపంతో ఇంటికి వెళ్ళిపోతుంది. నిరుపమ్ మాత్రం హిమతో నువ్వంటే నాకు ఇష్టం. మన పెళ్లి జరగడం ఖాయం అని అంటాడు. నిరూపమ్ ఎంత మాట్లాడుతున్న హిమ వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సౌర్య, హిమ ఒకరి తరువాత ఒకరు కోపంతో ఇంటికి రావడంతో సౌందర్య ఏంటి అప్పుడే వచ్చావు అని ముందు సౌర్యను అడగగా కాస్త వెటకారంగా సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తరువాత అక్కడికి హిమ రాగానే ఏంటే అంటే హిమ కూడా మాట్లాడకుండా కోపంతో గదిలోకి వెళ్లిపోతుంది.
నిజం తెలుసుకున్న సౌర్య… హిమను ప్రేమతో దగ్గరకి తీస్తుందా..?
మరొకవైపు సౌర్య, హిమపై కోపంతో హిమ ఉన్న ఫోటోకి బాణాలు గురిపెడుతూ విసురుతూ ఉంటుంది.ఇంతలో హిమ అక్కడికి వచ్చి సౌర్య ఎదురుగా నుంచుని నా మీద నీకు అంత కోపం వస్తే ఆ బాణాలు నా మీదకీ విసురేయ్..నన్ను చంపేయ్ అని ఉంటుంది.నే చెప్పే మాట అసలు వినవు నువ్వు అని ఎమోషనల్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో హిమ అనుకుని నిరూపమ్ సౌర్యకి ఐ లవ్ యు అని చెప్పడంతో సౌర్య షాక్ అవుతుంది. తరువాత నిరూపమ్ నేను నిన్ను హిమ అనుకునే ఐ లవ్ యు చెప్పాను అని అనడంతో శౌర్య కంట్లో నీళ్లు తిరుగుతాయి.ఆ తర్వాత హిమ మాత్రం నిరూపమ్ తో సోర్యకు నువ్వంటే ఇష్టం బావ తనని నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పిన మాటలను శౌర్య విని చాలా ఎమోషనల్ అవుతూ హిమని ఒక్కసారిగా హత్తుకుంటుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!