NewsOrbit
Telugu TV Serials

సౌర్యకు ఐ లవ్ యూ చెప్పి మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నిరూపమ్.!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో సౌర్య, హిమలు ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకోవడం చూసి ఆనందరావు, సౌందర్య ఇద్దరు ఎంతో సంతోషిస్తారు. అదే క్రమంలో హిమ, నిరూపమ్ ఇద్దరు రెస్టారెంట్ లో మాట్లాడుకోవడం చూసి సౌర్య ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఇంటికి. వచ్చి హిమ ఫోటోపై బాణాలు విసురుతూ ఉంటుంది. అదే క్రమంలో నేటి ఎపిసోడ్ మంచి ఆసక్తిగా ముందుకు సాగిందనే చెప్పాలి. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

హిమ మీద కోపంతో సౌర్య ఏమి చేసింది?

ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య దగ్గరికి వెళ్లిన హిమ నన్ను చంపి నా మీద కోపం ఉంటే కొట్టు అని అనగా వెంటనే సౌర్య చంపేయడాలు నీలాగా నాకు అలవాటు లేదు అని అంటుంది. మనుషుల ప్రాణాలను అవలీలగా తీయడం నీకు మాత్రమే తెలుసు నాకు తెలియదు అనడంతో ఆ మాటలు వింటున్న సౌందర్య,ఆనందరావు, హిమలు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. అలా అని తప్పు చేసిన వారిని క్షమించే అంత మానవత్వం కూడా నా దగ్గర లేదు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది సౌర్య.

తన ఇంట్లోనే పరాయిదానిలా బతుకుతున్న సౌర్య:

మరొకవైపు ప్రేమ్,స్వప్న అన్న మాటల గురించి తలుచుకుని ఆలోచిస్తూ ఉంటాడు.పెళ్లిని ఎలా అయినా ఆపాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత సౌర్య ఆటోకీ బేరం రావడంతో ఒక అతన్ని ఎక్కించుకుంటుంది. ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే సౌందర్య వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పగానే సరే అని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇక ఆటో దిగిన వ్యక్తి జ్వాలకు డబ్బులు ఇచ్చి ఇంటి లోపలికి వెళ్లి ఆనందరావుతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో సౌర్య ఇంట్లోకి రావడం చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఏంటి అమ్మాయి ఆటో డబ్బులు ఇచ్చాను కదా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉండగా సౌర్య మీకెందుకు సార్ అని అంటుంది. ఆ మాటలకు ఆనందరావు నవ్వుతూ ఉంటాడు.అప్పుడు సౌర్య ఇది మా ఇల్లు. ఆనందరావు మా తాతయ్య అనడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు.మరొకవైపు హిమ, సౌర్య  గురించి తలచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.మరొకవైపు సౌర్య ఏమో కార్తీక్, దీపల ఫోటోల ముందు నిలబడి బాధపడుతూ ఉంటుంది. మీరు చనిపోయారు నా పరిస్థితి ఇలా అయింది.మన ఇంట్లోనే నేను పరాయిదానిలాగా ఉన్నాను అని బాధపడుతూ ఉంటుంది. డాక్టర్ సాబ్ ఇచ్చిన ఫోన్ నా దగ్గరే ఉంది తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది.

సౌర్యకు ఐ లవ్ యూ చెప్పిన నిరూపమ్ :

సీన్ కట్ చేస్తే ఇంటికి వచ్చిన నిరూపమ్ సోఫాలో కూర్చున్న సౌర్యతో హిమ అనుకుని వెనుక వైపు నుంచి చూసి సౌర్యను ముట్టుకొని ఐ లవ్ యు చెబుతాడు. అయితే ఆ తర్వాత సౌర్య ఇటు తిరిగేసరికి ఒక సరిగా షాక్ అవుతాడు నిరుపమ్.నేను హిమ అనుకొని ఐ లవ్ యు చెప్పాను అని అనడంతో సౌర్య ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత నిరూపమ్ హిమ ఎక్కడ ఉంది..ఏంటి మీరిద్దరూ ఒకటే డ్రస్సు వేసుకున్నారు అని అడగగా సౌర్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో అక్కడినుంచి నిరుపమ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నిరుపమ్,హిమ దగ్గర వెళ్ళి ఏంటి మీరిద్దరూ ఒకే డ్రెస్ వేసుకున్నారు నువ్వే అనుకొని నేను సౌర్యతో మాట్లాడాను అని అంటాడు.అప్పుడు హిమ, సౌర్య గురించి నిరుపమ్ ని అడుగుతూ ఉంటుంది.

నిరూపమ్ తో సౌర్యను పెళ్లి చేసుకోమన్న హిమ:

మన పెళ్లి క్యాన్సిల్ చేసి అదే ముహూర్తానికి నువ్వు సౌర్య మెడలో తాళిబొట్టు కట్టాలి అని ఉంటుంది. అప్పుడు హిమ మాటలకు నిరుపమ్ షాక్ అయ్యి ఎంతసేపు సౌర్య గురించి ఆలోచిస్తావ్ గాని నా మనసు అర్ధం చేసుకోవా అని కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు హిమ నా మీద ప్రేమ ఉంటే నాకోసం ఈ పని చెయ్యి అని అనడంతో నిరూపమ్ హిమ పై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వారిద్దరు మాట్లాడుకుంటున్న మాటలను సౌర్య వింటుంది. ఆ తర్వాత నిరుపమ్ హిమ మాటలు తలుచుకుంటూ సౌందర్య, ఆనంద్ రావ్ ల దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉంటారు.

హిమ, సౌర్య కలిసిపోయారుగా..?

వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయ్యాయి మా మమ్మీ కూడా ఒప్పుకుంది కానీ హిమ మాత్రం ఇలా మాట్లాడుతూ ఉంది ఉంటాడు నిరుపమ్. హిమ మనసును మీరైనా మార్చండి అని చెప్పి నిరుపమ్ అక్కడ నుండి వెళ్లిపోగా వెంటనే సౌందర్య హిమను ప్రశ్నించగా అప్పుడు హిమ ఎలా అయినా బావకి సౌర్యకి పెళ్లి చేయాలి అని అనడంతో సౌర్య అక్కడికి వచ్చి హిమను గట్టిగా కౌగలించుకుని డాక్టర్ సాబ్ ను నన్ను కలపడానికి నువ్వు ఇంతలా ప్రయత్నిస్తున్నావా అంటూ ఎమోషనల్ అవుతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri