బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో బోనాలు తర్వాత ఇంటికి వచ్చేసిన సౌందర్య, ఆనందరావులు ఎలాగయినా హిమని, సౌర్యని ఇంట్లోనే ఉంచెయ్యాలనుకును ప్లాన్. చేసి. మరి సౌర్య ఆటో టైర్ కి పంచర్ వేస్తారు.మరోవైపు హిమని ఆపేందుకు కూడా ఆనందరావుకు ఆరోగ్యం సరిగా లేదని ప్లాన్ వేస్తారు. అదే సీన్ ఈరోజు ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అవుతుంది.సౌర్య సోఫాలో ఉంటుంది. ఆ పక్కనే ఆనందరావు ఉంటాడు. సౌందర్య కూడా అక్కడే ఉంటుంది.
హిమను హాస్పిటల్ కి వెళ్లకుండా ఆపిన సౌందర్య:
ఇంతలో హిమ రెడీ అయ్యి ఆసుపత్రికి వెళ్తున్నా అంటుంది. ‘ఇంట్లో పేషెంట్‌ని పట్టించుకోవు గానీ.. ఆసుపత్రికి వెళ్తావా అంటే ఏమైంది నాన్నమ్మ అంటే తాతయ్యకు ఆరోగ్యం బాలేదని అంటుంది సౌందర్య .ఆనందరావు కూడా బాగానే నటిస్తుంటాడు. అంతా చూస్తున్న సౌర్య.. ‘పదా ఆసుపత్రికి తీసుకుని వెళ్దాం తాతయ్యని’ అంటుంది సౌందర్యతో. ‘ఇంట్లో డాక్టర్ ఉండగా ఆసుపత్రికి ఎందుకే’ అని మాట మారుస్తుంది సౌందర్య. సరే అని హిమ కూడా ఇంట్లోనే ఉండి తాతయ్యను చూసుకుంటా అంటుంది.
నిరూపమ్,సౌర్యలను కలిపే పనిలో ప్రేమ్, హిమలు :
సీన్ కట్ చేస్తే బయట హిమ దిగులుగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ప్రేమ్ వస్తాడు. ‘ఏంటి ఎప్పుడూ అలానే మూడీగా ఉంటావ్?’ అని ఆరా తీస్తాడు. సౌర్య, నిరుపమ్ బావల పెళ్లి ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్న అంటుంది. ‘వాళ్లని కలిపే బాధ్యత నాది’ అంటాడు ప్రేమ్.హిమా ప్రేమ పెరగాలంటే ఇద్దరూ ఒకే చోట ఉండాలి.ఎప్పటికప్పుడు కలుసుకుంటూ మాట్లాడుకుంటూ,కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకోవాలి అంటూ ప్రేమ పాఠాలు చెబుతాడు. నిరుపమ్‌ని కూడా వెంటనే ఇక్కడికి వచ్చేలా చేద్దాం తాతయ్యకి బాలేదని చెబుదాం’ అంటాడు. సరేనంటుంది హిమ.
నిరూపమ్ మాటలకు షాక్ అయిన శోభ :
ఇక నిరుపమ్, శోభలు కాఫీ షాప్‌లో ఉంటారు. ‘నిరుపమ్‌ని ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటూ శోభ ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే నిరూపమ్ మాటల సందర్బంలో ‘హిమకు క్యాన్సర్ లేదు అనే విషయాన్నీ చెప్పేస్తాడు.. శోభ బిత్తరపోతుంది. అంతేకాకుండా ఆ ఆటో జ్వాల ఎవరో కాదు ఇంట్లోంచి వెళ్లిపోయిన మా సౌర్యే అంటాడు. ఈ సారి శోభకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. ‘నా.. టైమ్ బాలేదు’అనుకుంటుంది శోభ.
స్వప్నకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శోభ :
ఇంతలో నిరుపమ్‌కి ప్రేమ్ కాల్ చేసి.. తాతయ్యకి బాలేదు అని చెబుతాడు. వెంటనే పరుగుతీస్తాడు నిరుపమ్.ఇక శోభ ఆవేశంతో వెంటనే స్వప్న దగ్గరకు వెళ్లి.. ‘నాకు ఇచ్చిన మాట సంగతి ఏంటీ.? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నాకు నిరుపమ్‌తో పెళ్లి చెయ్యాల్సిందే. లేదంటే నేను ఊరుకోను ఆంటీ అని. గట్టిగా వార్నింగ్ ఇచ్చి మరి వెళ్తుంది.
హడావిడిగా తాతయ్య దగ్గరకు వచ్చిన నిరూపమ్ :
ఇక సీన్ కట్ చేస్తే నిరుపమ్ హడావిడిగా సౌందర్య ఇంటికి పరుగుతీస్తాడు. అక్కడ ఆనందరావు, సౌందర్య, ప్రేమ్, హిమలు కాస్త ఓవర్ యాక్టింగే చేస్తారు. ఇంతలో జ్వాలా సుమతీ పంపించింది అంటు ఆటోకి స్టెప్నీ టైర్ తీసుకొస్తాడు ఒక వ్యక్తి.పదా టైర్ మారుద్దాం అని జ్వాల ఆటో దగ్గరకు వెళ్లిపోతుంది. దాంతో సౌందర్య, ఆనందరావులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. సౌర్య ఆటో బాగు అయిపోయి ఆటో స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ప్రేమ్ సౌందర్యతో.. ‘అమ్మమ్మా తను వెళ్లిపోతే ఎలా.. ఎలాయినా సౌర్యను ఆపు అంటుంది.ఇక సౌందర్య.. సౌర్య ఆటో దగ్గరకు పరుగుతీసిసౌర్యని ఆపుతుంది. ‘తాతయ్యకి బాగోలేదు కదా ఎందుకు వెళ్తున్నావ్’ అంటుంది. తాతయ్యకు బాగోకపోతే నేనేం చేయాలి నాన్నమ్మా.. నాకు ఆటోనే కదా జీవనాదారం అంటుంది. అయినా ఇంట్లో చాలా మంది డాక్టర్లు ఉన్నారుగా అని కోపంగా అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!