Telugu TV Serials

డాక్టర్ బాబు బతికే ఉన్నాడా… ఉంటే ఎక్కడ ఉన్నట్టు అని ఎమోషనల్ అవుతున్న దీప..!

Share

డాక్టర్ బాబు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1432 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగష్టు 16 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరగనుందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో దీప రీఎంట్రీతో సీరియల్ మరొక కీలక మలుపు తిరిగిందనే చెప్పాలి. దీప, కార్తీక్ లేని సీరియల్ ను ఉహించుకోవాలంటేనే కష్టంగా మారిన అభిమానులకు దీప ఎంట్రీ ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే నేటి కధనం మరింత ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి. గుళ్లో సౌందర్య వాళ్ళ కుటుంబాన్ని కలిసిన వారణాసి దీప, కార్తీక్ బతికే ఉన్నారు’ అని సౌందర్య కుటుంబానికి చెప్పడంతో అందరూ కూడా షాక్ అవుతారు. వారణాసే వీళ్లందరికీ గతం చెబుతున్నాడు.

కోమాలో నుంచి బయటకు వచ్చిన దీప :

అలాగే అసలేం జరిగింది అనేది డైరెక్టర్ ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వంటలక్క కోమాలోంచి బయటికి వచ్చి డాక్టర్ బాబు కోసం ఆసుపత్రి అంతా వెతుకుతుంది. దీపను చూసిన డాక్టర్ నీతో పాటు ఈ ఆసుపత్రికి ఎవ్వరూ రాలేదు’ అని చెప్పడంతో దీప మరింత ఎమోషనల్‌ అవుతుంది.డాక్టర్ బాబు ఏం అయ్యి ఉంటారు? ఆ రంగురాళ్ల వాళ్లకి నేను దొరికినట్లే.. నా డాక్టర్ బాబు ఎందుకు దొరకలేదు అంటే డాక్టర్ బాబు ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండి ఉంటారు అనుకుంటుంది. మనుషులున్నప్పుడు ప్రేమని దూరం చేయడం. ప్రేమ దక్కే సమయానికి మనుషుల్ని దూరం చేయడం ఇదేం ఆట దేవుడా? అంటూ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పి కుమిలి కుమిలి ఏడుస్తుంది దీప. ఇక డాక్టర్ నీ పేరు ఏంటమ్మా అంటాడు. దీప ఏడుస్తూనే తన పేరు చెప్పి డాక్టర్ బాబు గురించిన వివరాలు చెప్తుంది.

డాక్టర్ ను అన్నయ్యా అని ప్రేమగా పిలిచిన దీప :

అంతా విన్న ఆ డాక్టర్‌ని దీప అన్నయ్యా అంటుంది. నోరారా అన్నయ్యా అని పిలిచావ్ కాబట్టి నీ అన్నగా ఈ విషయంలో నీకు అండగా ఉంటాను అంటాడు డాక్టర్. దీప పైకి లేచి ఈ ఒక్క సాయం చేయండి అన్నయ్యా..నన్ను డాక్టర్ బాబుని కలిసేలా చూడండి అంటుంది.మీకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అంటుంది దీప దన్నం పెడుతూ. చూడమ్మా. సాధారణంగా అనుమానాస్పదంగా చనిపోయిన వారిని ఈ గవర్నమెంట్ ఆసుపత్రికే తీసుకొస్తారు. బాడీ తీసుకుని వెళ్లడానికి ఎవ్వరూ రాకుంటే కొన్ని రోజులు మార్చురీలో ఉంచుతారు. నువ్వు దొరికిన రోజే ఒక శవం వచ్చింది. దాన్ని చూసి నువ్వు కన్ఫామ్ చేస్తే చాలు అని మార్చురీ గదికి తీసుకుని వెళ్తాడు. దీప ఏడుస్తూనే మార్చురీకి వస్తుంది. తీరా ఆ శవం దగ్గరకు దీప వెళ్లేసరికి దీపకు కార్తీక్ చివరిసారిగా వేసుకున్న షూస్ కనిపిస్తాయి. అవి చూసి దీప మరింతగా భయపడుతుంది. తీరా ఆ శవంపైనున్న క్లాత్‌ని తప్పిస్తాడు డాక్టర్. దీప చూడలేక కళ్లు మూసుకుంటే ఏం కాదమ్మా చూడు నీ భర్త కాదు’అంటూ ధైర్యం చెప్పడంతో దీప కూడా ఆ చనిపోయిన వ్యక్తిని చూసి తన భర్త కాదు అని కన్ఫర్మ్ చేస్తుంది.దాంతో దీపకు కాస్త ధైర్యం వస్తుంది. మార్చురీ బయటికి వచ్చాక ‘అమ్మా ఇంక నీ భర్త ఎక్కడో క్షేమంగానే ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు అని దీపను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు డాక్టర్.

కార్తీక్ చనిపోయాడా… బతికే ఉన్నాడా..?

సీన్ కట్ చేస్తే ప్రమాదం జరిగిన కొన్ని రోజులకి అంటే సౌర్య, హిమల చిన్నప్పుడు సౌర్య ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత చిన్న హిమ సౌందర్య ఇంట్లో దిగులుగా కూర్చుని ఉంటుంది. ఆ పక్కనే సౌందర్య, ఆనందరావు కూడా కూర్చుని అన్నం తినమని ఎంత బ్రతిమిలాడినా హిమ తినడానికి ఇష్టపడదు. వెంటనే సౌందర్య ఆవేశంగా ఇక్కడి నుండి వెళ్లిపోదాం అండి.. నాకు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు ఈ ఇంటితోనే అన్ని సమస్యలు ఇంకా ఆ జ్ఞ‌పకాలలో బతకాలని లేదు మనం అమెరికా వెళ్లిపోదాం’ అంటుంది ఏడుస్తూ. ఇక హిమ మాత్రం వద్దు నాన్నమ్మా మనం ఈ ఇల్లు వదిలేసి వెళ్తే మళ్ళీ ఎప్పుడన్నా సౌర్య తిరిగి వస్తే ఎలా? సౌర్య వచ్చాక అప్పుడు అందరం కలిసి అమెరికా వెళ్దాం అంటుంది హిమ ఏడుస్తూ. ‘సౌర్యని వెతికిస్తాను హిమ దానిని వదిలిపెట్టను. కానీ ఈ ఇల్లు మనకొద్దు ఈ ఇల్లు అమ్మేద్దాం’ అని సమర్థిస్తాడు ఆనందరావు. మరో వైపు.. దీప అన్నగా భావిస్తున్న డాక్టర్ దీపపై జాలిపడి తన ఇంటికి తీసుకుని వెళ్లి తల్లికి పరిచయం చేస్తాడు. డాక్టర్ అమ్మా దీపను చాలా ప్రేమగా మాట్లాడుతూ ‘నీకొచ్చిన కష్టం ఆ పగవాడికి కూడా రావద్దమ్మా’ అంటూ జాలిపడుతుంది. దాంతో దీప కాస్త ఎమోషనల్ అవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

ఆదిత్యతో చేసి గెలిచే వరకు ఇంటికి వెళ్ళనన్నా దేవి..! ఆ పని నేనే చేశానన్న సత్య..!

bharani jella

మోనితను చూసిన సౌందర్య… హైదరాబాద్ వెళదాం అంటున్న కార్తీక్..!

Ram

సౌర్యకు ఐ లవ్ యూ చెప్పి మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నిరూపమ్.!

Ram