Telugu TV Serials

వారణాసి రాకతో కధలో కీలక మలుపు… అదే నిజం కానుందా..?

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1431 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగష్టు 15 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.నేటి కథనంలో నిరుపమ్ ఒకచోట నుంచుని హిమ గురించి ఆలోచిస్తు ఉంటాడు. అదే సమయంలో ప్రేమ్ అటుగా వస్తాడు. ‘అమ్మో వీడికి కనిపిస్తే మళ్లీ నీ ప్రాబ్లమ్ ఏంటని వెంట పడతాడు అంటూ అక్కడ నుంచి వెళ్లబోతాడు. ఇంతలో నిరుపమ్ ప్రేమ్‌ని చూసేస్తాడు. రేయ్ ఆగరా.. ఏం అయ్యింది? వెళ్లిపోతున్నావ్ ఏంటీ?’ అని అడుగుతాడు. ‘మూడ్ బాలేదు’ అంటాడు ప్రేమ్. ఇంతలో నిరుపమ్‌కి హిమ కాల్ చేస్తుంది. ‘చెప్పు హిమా’ అంటూనే.. ప్రేమ్ వెళ్లిపోతుంటే.. ‘ఆగరా’ అని పట్టుకునే హిమతో ఫోన్ మాట్లాడతాడు‘హా హిమా.. గుడికి వెళ్లారా.. గుడి నుంచి రాగానే నాకు కాల్ చేయ్ నీతో మాట్లాడే పని ఉంది’ అంటూ ఫోన్ పెట్టేస్తాడు.

అమ్మా నాన్నలకు తన ప్రేమ విషయం చెప్పడానికి రెడీ అయిన ప్రేమ్ :

ఏంట్రా అలా వెళ్లిపోతున్నావ్ అంటే వెంటనే ప్రేమ్ మనసులో హిమ పెళ్లి ఆపమంటుంది కానీ తన మనసులో నేను ఉన్నానో లేదో చెప్పట్లేదు అనుకుంటాడు.అసలు ఒక మనిషి మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలిరా’ అంటాడు ప్రేమ్ ఆత్రంగా. ‘భలే ప్రశ్న వేశావ్‌రా.. విషయం పూర్తిగా చెబితే అప్పుడు నేనేదైనా సలహా ఇవ్వగలను’ అంటాడు నిరుపమ్.ఇలా కాదు కానీ.. హిమ మీద నా ప్రేమ విషయం వెంటనే మమ్మీ డాడీలకే చెప్పేస్తాను. అప్పుడు వాళ్లైనా నాకు సాయం చేస్తారేమో అనుకుంటాడు. స్వప్న, సత్యం ఇద్దరూ గుడికి వెళ్లే హడావుడిలో ఉండి తరువాత మాట్లాడతాం అని ప్రేమ్ తో అంటారు.

అమ్మా నాన్న తిరిగి రావాలి :

 

ఇక గుడికి వెళ్లిన సౌందర్య కుటుంబంలో ఒక్కోక్కరూ ఒక్కో కోరిక కోరుకుంటూ దన్నం పెట్టుకుంటారు. సౌర్య మాత్రం దీప, కార్తీక్ బతికి రావాలని. కోరుకుంటుంది.మరోసారి దీప కోమాలో ఉన్న సీన్ చూపిస్తారు డైరెక్టర్. ఇక హిమ దేవుడికి దన్నం పెట్టుకున్న తర్వాత సౌర్య దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలి’ అంటుంది. ‘ప్రతి సారీ ఇదో నాటకం అయిపోతుంది పదా ఏం మాట్లాడాలో మాట్లాడుదువు గానీ..’ అంటూ చేయి పట్టుకుని పక్కకు లాక్కుని వెళ్తుంది. సౌందర్య ,ఆనందరావులు కంగారు పడుతూ వాళ్ల వెనుకే సౌర్య ఆగవే అంటూ వెనుకే పరుగుతీస్తారు.సౌర్య హిమని పక్కకు లాక్కెళ్ళి చెప్పు ఏం చెబుతావో అంటుంది. ‘సౌర్యా ప్లీజ్ నీకు దన్నం పెడతాను నేను ఏది అబద్దం చెప్పట్లేదు అన్నీ నిజాలే చెబుతున్నాను అంటుంది హిమ.

హిమ మాటలను సౌర్య నమ్ముతుందా..?

ఆ రోజు చిక్ మంగుళూర్‌లో కారు పడిపోయే ముందు నన్ను కారులోంచి అమ్మా నాన్న బయటికి తోసేశారు అమ్మా డాడీలు చివరి సారిగా ఏమన్నారో తెలుసా.. సౌర్యని నువ్వే చూసుకోవాలి.. సౌర్య జాగ్రత్త అని చెప్పారు అని అంటుంది. నీకో విషయం చెప్పనా నిన్ను పెంచిన ఇంద్రుడు చంద్రుడు పిన్నీ బాబాయ్‌లే ఆ రోజు నన్ను కాపాడారు. వాళ్లే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అనుకోకుండా వాళ్ల నుంచి నేను విడిపోయాను’ అంటూ హిమ ఏడుస్తూ చెబుతుంది.అంతా వింటున్న సౌర్య నీ ఆత్మకథలన్నీ నాకెందుకు కానీ.. విషయం ఏంటో చెప్పు’ అంటుంది కోపంగా. ‘సౌర్యా దేవుడి సమక్షంలో చెబుతున్నాను బావంటే నీకు ఇష్టం అని తెలిశాక మిమ్మల్ని కలపాలనే ప్రయత్నిస్తున్నాను అంటుంది హిమ ఏడుస్తూ. ‘ఆపుతావా నీ కథలు’ అంటుంది సౌర్య కోపంగా. ఏం చేస్తే నమ్ముతావ్.. ఎలా చెబితే నువ్వు నమ్ముతావ్’ అంటుంది ఏడుస్తూ. ‘అమ్మా నాన్నల వచ్చి చెబితే నేను నమ్ముతాను’ అంటుంది సౌర్య కోపంగా. ‘వాళ్లు ఎలా తిరిగి వస్తారే’ అంటుంది ఆవేదనగా సౌందర్య.

కార్తీక్, దీప వస్తారు అనే నిజాన్ని చెప్పిన వారణాసి :

సౌర్యమ్మ అనుకునేది నిజమే అంటూ వారణాసి వస్తాడు. వారణాసి మాటలకు అంతా షాక్‌లో ఉంటారు. సౌర్యమ్మ అనుకుంటుంది నిజమేనమ్మా వాళ్లు బతికే ఉన్నారు’ అంటాడు.నా కోడలు దీప, నా కొడుకు కార్తీక్ బతికే ఉన్నారా’ అంటుంది సౌందర్య. అవున్నమ్మా నేను చెప్పేది నిజం’ అంటాడు వారణాసి. అంతా షాక్ అవుతారు. అలాగే మరొక ప్రోమోలో దీప హాస్పిటల్ లో నుంచి లేచి డాక్టర్ బాబు. అంటూ ఏడవడం చూపిస్తారు. తరువాత డాక్టర్ మార్చురిలో ఉన్నా శవాన్ని గుర్తుపడతారా అంటూ అనడంతో ఏడుస్తూ లోపలికి వెళ్లి అక్కడ కార్తీక్ చివరిసారిగా వేసుకున్న షూస్ చూసి ఏడుస్తూ ఉంటుంది.


Share

Related posts

సామ్రాట్ గతంలో ఉన్న విషాదం.!? నందుని తులసిని ప్రాధేయపడమన్నా లాస్య..!

bharani jella

Karthika Deepam: అనుకున్నంతా అయిపొయిందిగా.. హిమ మెడలో బలవంతగా తాళి కట్టిన నిరీపమ్..!

Ram

ఆ రెండు స్థానాలలో కొట్టుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టిఆర్పి రేటింగ్..!?

bharani jella