Telugu TV Serials

మోనితను దీప అని పిలిచిన కార్తీక్…షాక్ లో మోనిత ..!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1442 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగష్టు 27 న ప్రసారం కానున్న కార్తీకదీపం సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో సౌర్యను వెతుకుంటూ సౌందర్య, హిమ, ఆనందరావులు వస్తారు. మరోపక్క గతం మర్చిపోయిన కార్తీక్ ను తన దగ్గరే ఉంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.

సౌర్యను కలిసిన ఆనందరావు :

ఎపిసోడ్ ప్రారంబంలోనే ఆనందరావు సౌర్య దగ్గరకు వెళ్లి ఎందుకమ్మా ఇంటికి రావడానికి ఇలా సంకోచిస్తున్నవు అని సౌర్యని అడగగా, అక్కడ హిమ ఉన్నది తాతయ్య నేను రాలేను అని శౌర్య కోపంగా చెబుతుంది.అప్పుడు ఆనందరావు మరి ఏం చేస్తే కోపం తగ్గుతుంది అమ్మ అని అనగా అమ్మానాన్నలను దూరం చేసిందిగా.. మళ్ళీ అమ్మానాన్నలు నాకు దగ్గర అయితే గాని నా కోపం పోదు తాతయ్య అని అంటది.అయినా నన్ను వదిలేసి మీరు బానే అమెరికా వెళ్ళిపోయారు కదా మళ్లీ ఎందుకు వచ్చారు.ఏదో పని ఉండి ఇటువైపు వచ్చి ఉంటారులే అంటుంది.అయినా మీరు ఎప్పుడైతే అమెరికా వెళ్ళిపోయారో అప్పుడే నన్ను మీరు వదిలేసారు. ఇంక నేను ఆ ఇంటి వైపు రాను అని అంటుంది శౌర్య. అప్పుడు హిమ సౌందర్యలు వెనకాతల నుంచి వింటూ నేను చెప్పాను కదా నానమ్మ కరెక్ట్ గా అదే సమయంలో శౌర్య వచ్చింది అంటుంది.అప్పుడు సౌందర్య, అది ఇంటికి రాకూడదని సాకులు వెతుకుతుంది అంటుంది. ఇక ఆనందరావు సౌర్యకి కొన్ని బట్టలు ఇస్తారు అప్పుడు శౌర్య, నాకు వద్దు తాతయ్య అని వెళ్ళిపోండి అని చెప్పి వారిని పంపించేస్తుంది.

దీపను చూసిన ఆనందరావు :

సీన్ కట్ చేస్తే దీప ఆటోలో వెళుతూ మొనిత శివని తీసుకువెళ్లిపోయిన సంఘటన గుర్తుతెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది.అదే సమయంలో. సౌందర్య వాళ్ళ కారు ఆటో రెండు పక్క పక్క నుంచి వెళ్తాయి. అప్పుడే ఆనందరావు దీపని చూస్తాడు కార్ దిగి దీప కనిపించింది అని అంటాడు.మీ భ్రమయుంటుందిలెండి తాతయ్య అని హిమ అంటుంది.ఇక దీపా ఆటో దిగి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ ఏవో టెస్టులు చేయగా ఎందుకు అన్నయ్య టెస్ట్ చేస్తున్నావు అని అనగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు కదమ్మా అన్ని జాగ్రత్తగా ఉండాలి.అది సరేగాని మీ ఆయన గురించి ఎమన్నా తెలిసిందా అని అడగగా జరిగిన విషయం అంత చెప్తుంది దీప.

కార్తీక్ నోటి వెంట దీప అనే మాట :

అంతా విన్న డాక్టర్..ఒకవేళ కార్తీక్ మొనితని గుర్తుపట్టినట్లయితే నిన్ను కూడా గుర్తుపట్టాలి కదా..నిన్ను గుర్తు పడితే సమస్య తీరిపోయినట్టే కదా అని అనుకుంటారు. ఆ తర్వాత సీన్లో కార్తీక్, మొనిత గదిలో ఉండగా కార్తీక్ కి కొంచెం కొంచెంగా గతం గుర్తొచ్చి ఒక్కసారిగా దీపా అని మొనితను పిలుస్తాడు. కార్తీక్ వెంట దీప మాట విని మోనిత షాక్ అవుతుంది. దీపా అన్నాడు అంటే కార్తిక్ కు గతం గుర్తొచ్చే అవకాశం ఉన్నది. అంటే నా టాబ్లెట్లు పనిచేయడం మానేస్తున్నాయా అని మనసులో అనుకుంటుంది. ఇక కార్తీక్ మాత్రం నిన్ను ఏమని పిలిచాను అనడంతో మోనిత అనే అన్నావు అంటుంది. సర్లే నాకు కొంచెం తలనొప్పిగా ఉన్నది తల పట్టు మొనిత అని కార్తీక్ అనగా ఇప్పుడు గాని నేను మధ్దన చేస్తే గతం గుర్తొచ్చే అవకాశం ఉన్నది అని చెప్పి ఫోన్ వచ్చింది అని తప్పించుకుంటుంది మోనిత.

సౌర్య గురించి బాధ పడుతున్న హిమ :

సీన్ కట్ చేస్తే హిమ, శౌర్య,ఆనందరావు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.నానమ్మ ఎలా అయినా సౌర్యని తీసుకువచ్చేయాల్సింది అంటుంది.ఒకవేళ మన ఇంటికి తీసుకువచ్చిన తర్వాత సౌర్య మళ్ళీ పారిపోతే అప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందో కూడా మనకు తెలియదు కదా అమ్మా అంటాడు.ఇప్పుడు అంటే సౌర్య ఎక్కడుందో మనకు తెలుసు కనుక ఎప్పుడు చూడాలనుకున్నా వచ్చి చూసి వెళ్లొచ్చు అంటాడు. కొన్ని రోజులు ఇలాగే ఉండనీద్దాం అమ్మా ఎప్పటికన్నా కోపం తగ్గిదేమో చూద్దాం అని అంటాడు. ఇక రేపటి. ఎపిసోడ్ లో దీప మళ్ళీ కార్తీక్ ను చూసి డాక్టర్ బాబు అంటూ వెంటబడుతుంది.. మరి కార్తీక్. దీప మాటలను నమ్ముతాడా అనేది రేపటి లో ఎపిసోడ్ చూద్దాం..!


Share

Related posts

Intinti Gruhalakshmi: పుంజుకున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టిఆర్పి రేటింగ్.. మళ్లీ ఆ స్థానానికి..!

bharani jella

Devatha Serial: ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పిన రాధ.. రుక్మిణీ కి ఫోన్ ఇచ్చిన ఆదిత్య..!

bharani jella

Guppedantha manasu : వసు, రిషిల ప్రేమబంధంకు అడ్డుగా నిలుస్తున్న “అమ్మా” అనే అనుబంధం..!!

Ram