బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్లో హిమకు ప్రేమ్ తనని ప్రేమిస్తున్న విషయం తెలుస్తుంది.మరోపక్క ఒకే గదిలో నిరూపమ్, సౌర్య ఉండిపోతారు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి. ఇక ఈరోజు కార్తీకదీపం 1423 ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందాం.తెల్లారగానే నిరుపమ్ నిద్ర లేచి ప్రేమ్ ను పిలుస్తాడు. నిరూపమ్ పిలుపు విని కారులో నిద్రపోతున్న ప్రేమ్, హిమలకు మెలుకువ వచ్చి లోపలికి వస్తారు.ఎలాగయినా తలుపు తియ్యరా బాబు అని ప్రేమ్‌తో అంటాడు.
సౌర్యను మరోసారి ఏడిపించిన నిరూపమ్.. ఆనందంలో హిమ, ప్రేమ్..!
ప్రేమ్ చేతిలో ఉన్న తాళం చూసి షాక్ లో నిరూపమ్, సౌర్య:
ఇక ప్రేమ్ రాయి దొరికిందిలే గాని ఉండు ఎలాగోలా పగలకొడతా అని తాళంను కొడుతూ ఉంటాడు. ఈ లోపు సౌర్యకు మెలుకువ వస్తుంది. ‘ఇప్పుడైనా తీస్తున్నారా లేక నాలుగైదు రోజులు ఈ ఇంట్లోనే ఉంచుతున్నారా’ అంటుంది సౌర్య వెటకారంగా. ప్రేమ్ తాళం పగలగొట్టి తలుపు తీస్తాడు. సౌర్య, నిరుపమ్ బయటికి వచ్చి ప్రేమ్ చేతిలోని చిన్న తాళం చూసిన షాక్ అవుతారు. ఏంటి ఈ తాళం పగలగొట్టలేక మమ్మల్ని రాత్రి అంతా లోపలే ఉంచావా అంటుంది సౌర్య. సర్లే పదండి మన కోసం ఇంట్లో అమ్మమ్మ తాతయ్య ఎదురు చూస్తూ ఉంటారు’ అంటాడు ప్రేమ్.
టెన్షన్లో సౌందర్య, ఆనందరావులు :
సీన్ కట్ చేస్తే సౌందర్య, ఆనందరావులు మానవరాళ్లు, మనవళ్ల కోసం టెన్షన్‌గా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో నలుగురు వస్తారు. సౌర్యని చూడగానే సౌందర్య కంగారుగా సౌర్యా నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటే? అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు’ అంటుంది కంగారుగా. అంటే ఏంటి నాన్నమ్మా.. ఆటో నడుపుకునే దానివి నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటీ? అయితే గియితే మాలాంటి రేంజ్ ఉన్నవాళ్లని కిడ్నాప్ చెయ్యాలి అనేనా నీ ఉద్దేశం?’ అంటూ రివర్స్‌లో గొడవకు దిగుతుంది.ఇక సౌందర్య సరేలేవే ఆ కిడ్నాప్ వివరాలు ఏం అడగను అని,దేవుడు దయవల్ల నీకు ఏం కాలేదు కదా దానికి సంతోషిద్దాం’ అంటుంది అవును అమ్మమ్మ.. సౌర్యని కాపాడబోయి గమ్మత్తుగా నిరుపమ్ కూడా ఇరుక్కున్నాడు’ అంటాడు ప్రేమ్. వాళ్లు లోపల ఉన్నారు సరే.. కానీ బయట ఉన్న మీరు కూడా తాళం తియ్యలేకపోవడం ఏంటీ?’ అంటుంది సౌందర్య. ఈలోపు సౌర్య కాస్త వెటకారంగా మాట్లాడంతో సౌర్యకు బయపడి వద్దులేరా బాబు నువ్వేం చెప్పొద్దు ఇంక అడగనులే’ అంటుంది సౌందర్య.
కోపంతో రగిలిపోతున్న స్వప్న :
ఇక అందరు మాట్లాడుకుంటూ ఉండగా స్వప్న వచ్చి కోపంతో ఓ ఫ్లవర్ వాజ్ ను విసురుతుంది.అసలు ఏం జరుగుతుంది ఈ ఫ్యామిలీలో అంటుంది. అది కాదు స్వప్నా.. మన సౌర్యని ఎవరో కిడ్నాప్ చేశారు తెలుసా’ అంటుంది సౌందర్య కంగారు పడుతూ. ‘నాకెందుకు మమ్మీ అవన్నీ? సౌర్యని కిడ్నాప్ చేశారు,హిమకు సన్మానం చేశారు అవన్నీ నాకెందుకు? నా కొడుకుల్ని ఈ ఇంట్లోనే బంధించేస్తారుగా? నా ఇద్దరు కొడుకుల్నిమీ మనవరాళ్ల కోసమే కన్నట్లు ఉన్నాను నేను అంటుంది.ఒకడ్ని అది మాయ చేస్తుంటే.. ఇంకొకడ్ని ఇది మాయ చేస్తుంది’ అంటుంది వెటకారంగా స్వప్న.. మధ్యలో సౌర్య తగులుకుని మర్యాదగా మాట్లాడు మాయ చేయడం ఏంటీ..? నువ్వు ఏది అన్నా వీళ్లు ఊరుకుంటారేమో నేను ఊరుకోను’ అంటుంది సౌర్య కోపంగా. స్వప్న కూడా సైలెంట్ గా ఉండకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక ప్రేమ్ కల్పించుకుని ఏంటి మమ్మీ నువ్వు? ప్రశాంతంగా ఉన్న చోట గొడవలు రేపుతున్నావ్..? ఇప్పుడు హిమ, సౌర్య ఏం చేసారు ఇలా మాట్లాడుతున్నావ్’ అంటాడు ప్రేమ్. ఇద్దరికి ఇద్దరూ ఈ ఇంటికి వచ్చి నాకే నీతులు చెబుతున్నారు. నేను చస్తేనే కానీ నాకు ఈ టెన్షన్ పోయేలా లేదు అని స్వప్న ఆవేశంగా వెళ్లిపోతుంది.
శోభ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా.?
స్వప్న ఆవేశంగా శోభ గదిలోకి వెళ్లి జరిగింది అంతా చెప్పి పరిస్థితి చేయి దాటిపోయింది అంటుంది ‘నిరుపమ్ ఇంటికి వచ్చేలా లేడు, హిమతో పెళ్లి ఆగేలా లేదు’ అంటుంది. దాంతో శోభ స్పప్నకు ఒక ప్లాన్ చెపుతుంది.ఆంటీ మీరు రెండు రోజులు భోజనం మానేయండి. మీ మీద ప్రేమతో నిరూపమ్. వచ్చేస్తాడు అంటుంది శోభ.సరే అన్నట్టు తల ఆడిస్తుంది స్వప్న.
హిమ మీద కోపంతో సౌర్య చేసిన పని:
ఇక సౌందర్య, ఆనందరావులు హిమ, సౌర్యల గురించి మాట్లాడుకుంటారు. నాకు ఏదో అనుమానంగా ఉందండి హిమ వాళ్లు బయటే ఉండి సౌర్య, నిరుపమ్‌లు కలిసి ఉండేలా ప్లాన్ చేసి ఉంటారేమో అంటుంది.అయినా ఈ సమస్యలు అన్ని పోవాలంటే హిమ, నిరుపమ్‌ల పెళ్లి జరగాలి అంటుంది సౌందర్య. అదీ నిజమే అంటాడు ఆనందరావు. ఇక సౌర్య అయితే నిరుపమ్ మాటల్నే తలుచుకుని బాధపడుతూ, హిమ మీద కోపంతో పిల్లో విసురుతుంది. అది ఆనందరావుకు తగలాగా ఇంకా నయమే పిల్లో విసిరావ్.. ఫ్లవర్ వాజు అయితే నా తల పగిలిపోయేది’ అంటాడు ఆనందరావు నవ్వుతూ. తాతయ్యా ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.