బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం. సీరియల్ 1427 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.గత ఎపిసోడ్లో స్వప్న ఏదో ఒక లేఖ చూపించి నిరుపమ్‌ని సెంటిమెంటల్ డ్రామాతో పడగొట్టి శోభతో పెళ్లికి ఒప్పిస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ కూడా అదే సీన్ తో ఓపెన్ అవుతుంది.నిరుపమ్ కూడా స్వప్న మాటలకు తలవంచి అయిష్టంగానే పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి వస్తాడు.నిరుపమ్‌ని చూసి స్వప్న మురిసిపోతుంది.
నిరూపమ్, శోభల పెళ్లి :
సీన్ కట్ చేస్తే హిమ ఫోన్లో శోభ-నిరుపమ్‌లు ఇద్దరు పెళ్లి బట్టల్లో ఉన్న సెల్ఫీ ఫొటో చూసి ఏడుస్తుంది. హిమ ఏడవడం చూసి ఆనందరావు, సౌందర్యలు పరుగున వస్తారు.‘
హిమా ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావ్..?’ అంటుంది సౌందర్య. అంతా అయిపోయింది నాన్నమ్మా అంటూ ఫొటో చూపిస్తుంది. అది చూసిన సౌందర్య, ఆనందరావులు కూడా షాక్ అవుతారు. ‘స్వప్న అత్త అనుకున్నట్టే చేసింది.ఇప్పుడు సౌర్యతో బావ పెళ్లి చేద్దాం అని నేను అనుకుంటే అది జరిగేలా లేదు అని ఏడుస్తుంది.అక్కడకు వచ్చిన సౌర్య.. హిమ ఏడవడం చూసి ఏంటీ ఈ నటనలు?’ అంటుంది. ఇది చూడవే అంటూ సౌర్యకు ఫోన్ అందిస్తుంది సౌందర్య.
పెళ్లి విషయం తెలుసుకున్న సౌర్య:
మీ స్వప్న అత్త ఎంత పని చేసిందో చూశావా అమ్మా’ అంటాడు ఆనందరావు కంగారుగా. వాళ్లు ఇద్దరికీ పెళ్లి అయిపోతుంది అంటూ హిమ ఏడుస్తూనే అంటుంది.ముందు నీ ఏడుపు ఆపు అంటుంది సౌర్య విసుగ్గా హిమని. ‘అది కాదు సౌర్యా.. నేను ఏడుస్తున్నది నా గురించి కాదు. నీకు బావకి పెళ్లి చెయ్యలేకపోతున్నాననే బాధతో అంటుంది హిమ ఏడుస్తూ. ‘ఆపుతావా నీ నటనలు వినీ వినీ విసుగు వచ్చేస్తోంది అంటుంది. ఇక సౌర్య మాత్రం ఎంతో నమ్మకంగా నాన్నమ్మా ఆ పెళ్లి జరగదు అని ఈ నటీమణికి చెప్పు..’ అంటుంది సౌర్య. ఆ పెళ్లి నేను ఆపుతాను అంటుంది సౌర్య. ‘ఎలా ఆపుతావే? అంటుంది సౌందర్య. ‘నాతో రండి అంటుంది సౌర్య. సౌర్య వెనుకే వెళ్తారు సౌందర్య, ఆనందరావు, హిమలు.
శోభ నిజస్వరూపం బయట పెట్టిన సౌర్య:
సీన్ కట్ చేస్తే శోభ తన ఫొటో చూసుకుని తనే మురిసిపోతూ అనుకున్నది అంతా అనుకున్నట్లే జరుగుతుంది. ఇక ఈ ఆస్తీ నాది కాబోతుంది’ అంటూ పొంగిపోతుంది. అప్పుడే సౌర్యను. కిడ్నాప్ చేసిన రౌడీని తీసుకుని స్వప్న ఇంటికి వస్తుంది సౌర్య..వాడ్ని చూడగానే శోభ కంగారు పడుతుంది.ఓ స్వప్న అత్తా.. రారా..’అంటూ పిలుస్తూనే ఉంటుంది సౌర్య.నిరుపమ్, ప్రేమ్, సత్యా, స్వప్న ఒకరి తర్వాత ఒకరు బయటికి వస్తారు. ‘మీరు ఎందుకు వచ్చారు? పెళ్లి ఇంట్లో ఈ రచ్చేంటీ’ అంటూ అరుస్తుంది స్వప్న. వెంటనే సౌందర్య.. వేగంగా వేళ్లి స్వప్న చెంపపగలగొడుతుంది. నా కోడలు నా కోడలు అని ఊరేగుతావ్ కదా.. నీ కోడలు ఏం ఘనకార్యాలు చేసిందో తెలుసుకో అంటుంది సౌందర్య. అక్కడ ఉన్న రౌడీ ఆ రోజు శోభ చేసింది అంతా చెబుతాడు. అంతా విన్న స్వప్న రేయ్ నువ్వు వెళ్లరా అనడంతో వాడు పారిపోతాడు. ‘అవును.. పెళ్లికి అడ్డొస్తుందని.. సౌర్యని కిడ్నాప్ చేయించి ఉంటుంది. ఇంతలో తప్పేముంది? అని శోభకు సపోర్ట్ గా మాట్లాడుతుంది. వెంటనే సౌర్య చప్పట్లు కొట్టి ‘సూపర్ స్వప్న అత్తా నువ్వు అంటూ నవ్వుతుంది.
శోభను కొట్టిన స్వప్న :
స్వప్న సపోర్ట్ తో శోభకు కొండంత ధైర్యం వచ్చేస్తుంది. వెంటనే కూల్‌గా ‘చూడు సౌర్యా.. నువ్వు ఏదో అనుకుని ఆశపడి వచ్చినట్లు ఉన్నావ్ గాని పెళ్లి భోజనం చేసి వెళ్ళమ్మా అంటూ వెటకారంగా అంటుంది.శోభ మాటలను విన్న సౌర్య.ఇంకేమైనా మిగిలిందా?’ అంటూ చప్పట్లు కొట్టి పిలవడంతో గుమ్మం దగ్గరకు బ్యాంక్ వాళ్లు వస్తారు. ‘ఏంటి శోభా మేడమ్.. లక్షలకు లక్షలు అప్పు చేసి ఇలా తప్పించుకుని తిరుగుతున్నారు.. ఎలా తీరుస్తారు అని అడిగితే ధనవంతుడైన డాక్టర్ని పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లి అయ్యాక మీ ఆస్తి అంతా తన పేరున రాయించుకుని ఆసుపత్రి లోన్ అంతా తీరుస్తా అని చెప్పారు కదా అంటాడు బ్యాంక్ మేనేజర్.అది విన్న స్వప్న శోభా ఇది నిజమా’ అంటుంది. ఇప్పటికైనా కళ్లుతెరువు స్వప్నా.. ఇది నీ మీద ప్రేమతోనో.. నిరుపమ్ మీద ప్రేమతోనో ఈ పెళ్లికి ఒప్పుకోలేదు.. నీ ఆస్తి కోసం ఈ నాటకం ఆడింది’ అంటుంది సౌందర్య. ‘ఆంటీ వీళ్ల మాటలు నమ్మొద్దు.. బ్యాంక్ ఆఫీసర్స్ కూడా నిజమైన వాళ్లు కాదు’ అంటూ స్వప్నని నమ్మించే ప్రయత్నం చేస్తుంది శోభ. వెంటనే లాగిపెట్టి శోభను కొడుతుంది స్వప్న.ఇక సౌర్య భుజం మీద చేయి వేసి థాంక్స్ అన్నట్లుగా నవ్వుతుంది స్వప్న.
హిమతో నిరూపమ్ పెళ్లి ఒప్పుకున్న స్వప్న :
ఇక సీన్ కట్ చేస్తే స్వప్న తన భర్త అయిన సత్యకు పాలు తీసుకుని వెళ్లి ప్రేమగా అందిస్తుంది. పడుకునే ముందు పాలు తాగడం ఒకప్పటి అలవాటు ఇప్పుడు కాలంతో పాటు నేను నా అలవాట్లు అన్నీ మార్చుకున్నాను స్వప్న అంటాడు సత్య. అయినా తప్పు అంతా నాదేనండి.. నా అహంకారంతో ఇటు మిమ్మల్ని.. అటు మమ్మీ డాడీల్నీ ఎంతగానో ఇబ్బంది పెట్టాను.వెంటనే హిమ, నిరుపమ్‌ల పెళ్లి పనులు మొదలుపెడదామండి’అంటుంది స్వప్న.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!