Categories: Telugu TV Serials

హిమ, సౌర్య కలిసిపోయారు.. కానీ ఎవరు ఊహించని షాక్ ఇచ్చిన నిరూపమ్..!!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో నిరుపమ్‌తో హిమ బావ సౌర్యను పెళ్లి చేసుకో అని. చెప్పిన మాటలను డోర్ బయట నుంచుని ఉన్న సౌర్య చాటుగా వినేస్తుంది..బావా నువ్వంటే సౌర్యకు ఇష్టం కాదు ప్రాణం. నువ్వు తననే పెళ్లి చేసుకో బావా’ అంటుంది. ‘నేను తనని పెళ్లి చేసుకుంటే తను సంతోషంగా ఉంటుందేమో.. నేను సంతోషంగా ఉండను అని కోపంగా చెప్పేసి అక్కడ కాదుగా’ అనేసి నిరుపమ్ వెళ్లిపోతాడు. అయితే తను మాట్లాడిన మాటలను సౌర్య విన్న విషయం హిమకు అర్థమవుతుంది. దాంతో మరింత భయపడుతుంది హిమ.అదే సీన్ తో ఈరోజు ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది.

హిమ మాటలు విన్న సౌర్య :

ఒక్కటైన సౌర్య, హిమలు…. ఇది కూడా కలయితే కాదు కదా..!!

ఇక కోపంతో బయటకు వచ్చినా నిరుపమ్ వెళ్తూ వెళ్తూ హాల్లో ఉన్న సౌందర్య, ఆనందరావులతో హిమ అన్న మాటలు గురించి చెబుతాడు. ఇక సౌందర్య అదేదో అన్నంత మాత్రన్న ఆ మాటలను నువ్వు సీరియస్‌గా తీసుకుంటే ఎలా చెప్పు’ అంటుంది. అమ్మమ్మా నాకు హిమ అంటే ఇష్టం.ఈ విషయంలో నేను సీరియస్‌గానే ఉంటాను.కానీ ఎంగేజ్మెంట్ రోజు ఇష్టం లేదు అని చెప్పింది. తర్వాత మమ్మీ వద్దు అంది. మమ్మీని బతిమలాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మమ్మీ కూడా ఒప్పుకుంది. పెళ్లి పనులు మొదలుపెట్టి,శుభ లేఖలు కూడా పంచేశాం.. ఇప్పుడు హిమ సౌర్యని పెళ్లి చేసుకోమంటోంది. ఇది ఎలా సాధ్యం చెప్పండి?’ అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్. ఇక ఆనందరావు, సౌందర్యలు బాధగా సోఫాలో కూర్చుని అసలు. ఏమి జరుగుతుంది అనే ఆలోచనలో పడతారు.

హిమను ప్రేమతో దగ్గరకి తీసుకున్న సౌర్య:

ఈలోపు హిమ కిందకి వస్తుంది.వెంటనే సౌందర్య ‘ఏంటి ఇదంతా నిరుపమ్‌ మనసును కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా అంటుంది. ఆనందరావు కూడా అదే మాట అంటాడు.సౌర్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అంటాడు. అయ్యో తాతయ్య మీకు అర్థం కావట్లేదు. సౌర్యకి నిరుపమ్ బావంటే ప్రాణం. ఏది ఏమైనా వాళ్లిద్దరి పెళ్లి నేను చేస్తాను’ అంటుంది హిమ. అప్పుడే సౌర్య కళ్లనిండా నీళ్లతో పశ్చాత్తాపంతో ‘హిమా’ అని ప్రేమగా పిలుస్తుంది. తిరిగి చూస్తుంది హిమ.‘నన్ను.. నన్ను పేరు పెట్టి పిలిచావా?’ అంటుంది హిమ ఎమోషనల్‌గా.ఇక. సౌర్య అలానే హిమ దగ్గరకు వెళ్తుంది. అది చూసి సౌందర్య, ఆనందరావులు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ‘హిమా.. నీకు నిజంగా నా మీద ఇంత ప్రేముందా? నన్ను, డాక్టర్ సాబ్‌ని కలపడానికి ఇంతలా తాపత్రయపడుతున్నావా? పెళ్లి ఫిక్స్ అయినా నువ్వు నన్ను చేసుకోమంటున్నావంటే నువ్వు గ్రేట్ హిమా.నువ్వు నా కోసం ఇంత చేస్తుంటే నేను నిన్ను శత్రువులా చూశాను అంటూ హిమని హత్తుకుని ఒక్కసారిగా ఏడ్చేస్తుంది. అది చూసి సౌర్య,హిమ,సౌందర్య, ఆనందరావులు మురిసిపోతారు. ‘సారీ హిమ నిన్ను ఎన్నో మాటలు అన్నాను.అవన్నీ మరిచిపోయి మనిద్దరం చిన్నప్పటిలా కలిసి ఉందాం అంటూ కళ్లు తుడుచుకుని ఇదే కదా నువ్వు కోరుకుంటోంది అంటుంది సౌర్య కోపంగా.అందరు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు.

నేను మారను అంటు అందరికి షాక్ ఇచ్చిన సౌర్య:

‘నేనొచ్చి హిమా నిన్ను అపార్థం చేసుకున్నాను అంటానని ఊహించుకున్నావ్ కదా.మళ్లీ నీ మాయలో పడతానని అనుకున్నావా’ అంటుంది సౌర్య కోపంగా. సౌర్య అది అని అనేలోపు నేను చెప్పేది మాత్రమే విను నువ్వు అని మీరేం ప్లాన్ చేస్తున్నారో.. నాకు తెలియదు అనుకుంటున్నావా? బయట కలిసి మీరేం మాట్లాడుకున్నారో నేను అంతా విన్నాను అంటుంది. నిరుపమ్ హిమతో.. మన పెళ్లి జరగుతుంది హిమా అని అన్న మాటలను నేను విన్నాను అంటుంది. అన్నీ చేసి నన్ను నమ్మించి.. కోపం పోగొట్టేలా చెయ్యాలని, మీ పెళ్లి దాకా సాఫీగా ఉండాలనే కదా నీ ప్లాన్.. నేను వింటున్నాని తెలిసే నువ్వు మహా గొప్పగా నటించావ్.. నువ్వు నిజంగానే డాక్టర్ సాబ్‌తో నా పెళ్లి చేస్తున్నావేమో అన్నట్లు నేను క్షణకాలం నమ్మేశాను.ఆ ముఖంలో బాధని నటిస్తావ్ చూడు అంటు వెటకారంగా మాట్లాడుతుంది.సౌర్యా నేనేం నటించడం లేదు.. ఇదంతా నిజమే’ అంటుంది హిమ ఆవేదనగా. నీ నటనను నమ్మను అనేసి సౌర్య అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

స్వప్నకు షాక్ ఇచ్చిన నిరూపమ్ :

సీన్ కట్ చేస్తే ఆవేశంగా ఇంటికి వచ్చిన నిరూపమ్ జరిగిన విషయం చెప్పి మమ్మీ హిమ ఇప్పటికీ మారడం లేదు మళ్ళీ ఆ సౌర్యనే పెళ్లి చేసుకోమంటోంది. అయినా అప్పుడు సౌర్య కోసమే క్యాన్సర్ నాటకం ఆడిందని నాకు ముందే తెలుసు అని చెప్పి స్వప్నకి పెద్ద షాక్ ఇస్తాడు. ‘అదేంట్రా.. తనకి క్యాన్సర్ లేదని నాకెందుకు చెప్పలేదు? నీకు ముందే ఎలా తెలుసు’ అంటుంది. ‘మమ్మీ నేను డాక్టర్‌ని.. నాకు ఆ మాత్రం తెలియదా? తనకి క్యాన్సర్ ఉన్నా లేకపోయినా నా ప్రేమలో మార్పు లేదు,పెళ్లిలో మార్పు రాదు అని తెగేసి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్. స్వప్న షాక్‌తో అక్కడే సోఫాలో కూర్చుంటుంది.


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

13 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago