Telugu TV Serials

Karthika deepam: వామ్మో… మోనిత స్కెచ్ మాములుగా లేదుగా..? కార్తీక్ ముందు దీపను దోషిగా నిలబెట్టిసిందగా..?

Share

Karthika deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1462 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 22న ప్రసారం కానున్న కార్తీకదీపం సీరియల్‌లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..ఈరోజు ఎపిసోడ్ మొదట్లో హిమ ఒక ఉత్తరం రాసి ఇంటి నుండి వెళ్ళిపోతుంది.. ఆనందరావ్ ఆ లేఖ చదువుతూ ఉండడంతో సీరియల్ మొదలు అవుతుంది.

Soundarya, ananda rao

Karthika deepam: ఇల్లు వదిలి వెళ్ళిపోయిన హిమ :

తాతయ్యా నేను కూడా సౌర్య దగ్గరకే వెళ్లిపోతున్నా తనని బాగా చూసుకోమని అమ్మా నాన్నల చివరి కోరిక. తను ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను. నా కోసం వెతుక్కుంటూ మీరు రావద్దు. బై తాతయ్యా అని హిమ రాసిన లేఖ చదివిన ఆనందరావు బాగా ఏడుస్తాడు. మరోపక్క సౌందర్య మోనిత గురించి తెలుసుకోవడానికి చీక్ మంగుళూర్ బయలుదేరింది. మళ్ళీ ఇప్పుడు హిమ టెన్షన్ ఏంటో?’ అని కుమిలికుమిలి ఏడుస్తాడు ఆనందరావు.మరోవైపు శివతో కావాలనే దీపకు అబద్ధం చెప్పిస్తుంది మోనిత. శివ మాటలను నమ్మిన దీప గుడ్డిగా వాళ్ళను వేరే కారులో ఫాలో అవుతూ వెళ్తుంది. వెనుక దీప ఫాలో కావడం చూసి రావే.. నువ్వు రావడమే నాకు కావాలి.. నీకు అక్కడ సినిమా చూపిస్తాను చూడు అంటూ మనసులో అనుకుంటుంది

Karthika Deepam: కొడుకును తీసుకువచ్చి మోనిత తన గొయ్యి తనే తవ్వుకుందిగా….??

Soundarya, monitha

మోనిత కోసం సౌందర్య వెతుకులాట:

మళ్ళీ సీన్ సౌందర్య దగ్గర ఓపెన్ అవుతుంది.చిక్ మంగుళూర్‌లో కారులో మోనిత కోసం వెతుకున్న సౌందర్యకు ఆనందరావు కాల్ చేస్తాడు. ‘సౌందర్య హిమ ఇల్లు వదిలి వెళ్లిపోయింది. సౌర్య దగ్గరకు వెళ్తున్నాను అని లేఖలో రాసింది’ అంటాడు బాధగా. బస్ స్టాండ్స్, రైల్వేస్టేషన్స్ అన్నీ వెతికాను సౌందర్య.. ఎక్కడా లేదు అంటాడు ఆనందరావు. ఏమి పిల్లలో ఏంటో అని కంగారు పడొద్దండి సౌర్య దగ్గరకు వెళ్తా అంది కదా..? బహుశా అక్కడే ఉండి ఉంటుందిలే ఇంకా నాకు మోనిత వివరాలేం దొరకలేదు. రెండు రోజుల్లో ఎలాగైనా పట్టుకుంటాను.మీరు ఒక్కరే అక్కడ ఉండడం ఎందుకులే ఇక్కడికి బయలుదేరి వచ్చేయండి అంటుంది సౌందర్య. ఆనందరావు సరే అంటాడు ఆనందరావు.

మోనిత ఉచ్చులో దీప :

Monitha -deepa

సీన్ కట్ చేస్తే మోనిత కారు ఓ చోట ఆపిస్తుంది.కార్తీక్ కారు ఆపగానే ఒక షాప్ మీద కార్తీక్ బట్టల కొట్టు.. ప్రొప్రైటర్ మోనిత’ అని రాసి ఉన్న ఒక బోర్డు చూపిస్తుంది అదేంటి మన పేర్లు రాసి ఉన్నాయి? అంటాడు కార్తీక్ ఆశ్చర్యంగా. ‘మన పెళ్లి అయిన కొత్తలో మనం ఇక్కడే వ్యాపారం చేసేవాళ్లం. ఆ తర్వాత ఇక్కడ బేరాలు రావట్లేదు అని దీన్ని మూసేసి అక్కడ బొటిక్ పెట్టుకున్నాం అంటుంది. ఇంకాస్త ముందుకు వెళ్ళాక మళ్ళీ. అక్కడ ఆ కారు ఆపి కిందకు దిగితారు.దీప కూడా ఆ బోర్డు చూసి షాక్ అవుతుంది. ‘ఇదేదో పెద్ద కుట్రలానే ఉంది’ అనుకుంటుంది మనసులో.మోనిత వాళ్ళని కాస్త దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది దీప.

కార్తీక్ కు కొత్త గతం క్రియేట్ చేసిన మోనిత :

Monitha plan

కార్తీక్, మోనితలను చూసి అక్కడున్న కొంత మంది ‘మోనితమ్మా, కార్తీక్ బాబు’ అంటూ పరుగున వస్తారు.అందంతా మోనిత సెట్టింగ్ అంతా ప్లాన్ ప్రకారం మోనిత వాళ్ళని సెట్ చేసి కార్తీక్ కు కొత్త గతం క్రియేట్ చేయుంచిది అన్నమాట.వాళ్ళు పలకరిస్తున్న కానీ కార్తీక్ ఎవరు వీళ్లంతా అన్నట్లుగా చూడటంతో ‘ఏంటమ్మా మోనితమ్మా.. మీ ఆయన గుర్తుపట్టట్లేదు ఇంకా తగ్గలేదా అంటారు. సర్లే. కానీ మీ బాబు దొరికాడా?’ అంటూ అక్కడున్న వాళ్లంతా అడుగుతారు. వెంటనే మోనిత ఆయనకి ఇంకా మందులు వాడుతున్నాను.బాబు కూడా దొరికాడు సుమలతా అని అంటుంది..

మోనిత వేసిన ప్లాన్ కు దీపకు మతిపోయిందిగా?

Deepa crying

అంతా చూస్తున్న దీపకు మతి పోతుంది. ‘ఏంటి ఇదంతా? అమ్మో డాక్టర్ బాబుకి కొత్త గతాన్నే క్రియేట్ చేస్తుందిగా ఇలా జరగకూడదు అంటూ డాక్టర్ బాబు అని అరుస్తుంది దీప. మోనిత నవ్వుకుంటుంది. దీప పరుగున వచ్చి ‘డాక్టర్ బాబు నమ్మకండి ఇందంతా పెద్ద మోసం’ అంటుంది దీప. వెంటనే అక్కడున్న ఆడవాళ్లు.. ‘ఏంటే వంటలక్కా? ఇంకా మా కార్తీక్ బాబుని వదిల్లేదా?’ అంటారు. దీప షాక్ అవుతుంది.దీన్ని ‘నమ్మకండి కార్తీక్ బాబు మిమ్మల్ని లాక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఇదో పెద్ద టక్కులాడి’ అంటారు వాళ్లంతా.మోనిత నవ్వుకుంటుంది..ఇదిగో కార్తీక్ బాబు దీని మొగుడు ఓ ఆర్‌ఎంపీ డాక్టర్. ఇంటింటికీ తిరిగి వైద్యం చేసేవాడు. అప్పట్లో ఇది మీ ఇంట్లో వంట చేసేది. నీ మీద మనసుపడి తన మొగుడునీ సాధిస్తూ ఉండేది దానితో వాడు వదిలేసి పోయాడు.అప్పటి నుంచి డాక్టర్ బాబు అని మీవెంటపడింది’ అంటూ కట్టకథలు చెబుతారు.డాక్టర్ బాబు ఇవన్నీ నమ్మొద్దు అని. దీప ఏడుస్తూ అంటే ఆపు వంటలక్కా కళ్లముందు ఇంతమంది చెబుతున్నది అబద్దం..నువ్వు చెప్పేది నిజమా అని అరుస్తాడు.అంతా ఆపేసి బుద్ధిగా మర్యాదగా బతుకు’ అంటూ బయలుదేరబోతాడు.

కధలో కీలక మలుపు…మోనిత సృష్టించిన కొత్త మనుషులు :

Monitha creation

ఇంతలో మరో కారు వచ్చి ఆగుతుంది.అందులోంచి దిగిన ఆవిడ. ‘కార్తీక్ ఎలా ఉన్నావ్ అని కార్తీక్‌లో ఏమైనా ఇంప్రుమెంట్ ఉందా? అంటుంది. ‘ఇంకాలేదే కావేరీ’ అంటుంది మోనిత.మోనిత, కావేరి ఇద్దరు ఫ్రెండ్స్ అని కార్తీక్ కు చెప్పి పదండి మా ఇంటికి వెళ్దాం అక్కడేదైనా గుర్తొస్తుందేమో’ అంటుంది కావేరి.వెళ్తూ వెళ్తూ ఆగి దీప వైపు చూసి ఈ వంటలక్క ఇక్కడుంది ఏంటి..?మీరు వెంటేసుకుని వచ్చారా లేక వెంటపడుతూ వచ్చిందా?’ అంటుంది కావాలనే. ‘శనిని ఎవరైనా వెంటపెట్టుకుని వస్తారా కావేరీ అమ్మా అంటుంది ఆ ఊరిలో జనంలో ఒకావిడ. ‘నీకు సిగ్గులేదా? ఇంకా మారలేదా?’ అంటూ తిట్టేస్తుంది కావేరి. చాల్లే కావేరి వదిలెయ్ ఇప్పటికే డోస్ బాగా ఎక్కువైంది పదా వెళ్దాం అంటూ మోనిత…దీపవైపు నవ్వుతూ చూస్తూ కార్తీక్ ను తీసుకుని బయలుదేరతారు.దీప మాత్రం ఏమి చేయాలో తెలియక కుమిలికుమిలి ఏడుస్తుంది. మరి దీప మోనిత ప్లాన్ ను ఎలా తిప్పికొడుతుందోఅనేది నెక్స్ట్ఎపిసోడ్ లో చూద్దాం..!


Share

Related posts

Devatha Serial: ఆదిత్య ఫోటో చించిన మాధవ్.. రుక్మిణీ కోసం దీక్ష చేస్తున్న దేవుడమ్మ..!

bharani jella

నందు, లాస్య కి ఊహించని షాక్ ఇచ్చిన తులసి.. సామ్రాట్ పెళ్లికి ఒప్పుకున్నాడా.!? 

bharani jella

దేవికి తన తండ్రిని పరిచయం చేసిన మాధవ్.. షాక్ లో రుక్మిణి, ఆదిత్య..! 

bharani jella