బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్లో సౌర్య తనకు హిమ మీద ఎంత కోపం ఉందో అనేది అందరికి చూపిస్తుంది. ఈ క్రమంలోనే హిమకు క్యాన్సర్ లేదు అదంతా హిమ ఆడుతున్న డ్రామా అని నాకు ముందే తెలుసని నిరుపమ్.. స్వప్నకి షాకిస్తాడు.నిరుపమ్ హిమ గురించి ఆలోచిస్తూ అల్లాడిపోతుంటే ఏంట్రా అలా అయిపోతున్నావ్.ఆ హిమ గురించి ఆలోచించి నువ్వు తిండి కూడా సరిగా తినట్లేదు అక్కడ అది మాత్రం చక్కగా తినేసి పడుకుని ఉంటుంది’ అని హిమని తిడుతుంది స్వప్న.మమ్మీ ప్లీజ్ హిమని మాత్రం ఏం అనొద్దు.. నాకు ఆకలిగా లేదు.నేను తినను,నువ్వు వెళ్లి తినేసెయ్ అంటాడు నిరుపమ్ కోపంగా.
ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న సౌందర్య, ఆనందరావులు :
సీన్ కట్ చేస్తే.. సౌందర్య హిమని, ఆనందరావు సౌర్యలను తినడానికి రమ్మంటూ బతిమలాడతారు కానీ ఇద్దరూ కుడా ఆకలిగా లేదంటారు. ఇక మరునాడు సౌందర్య, ఆనందరావులు ఒక ప్లాన్ వేసుకుని బ్యాగ్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతూ ఆపరేషన్ వృద్ధాశ్రమం అనే ప్లాన్ ను అమలు చేస్తారు.ఇంతలో అటు నుంచి సౌర్య, ఇటు నుంచి హిమ బయటికి రావడం చూసి ‘వస్తున్నారండి’ అంటుంది సౌందర్య. హ వస్తున్న అంటూ ఆనందరావు రావడంతోనే ఇద్దరూ ఏడుపు ముఖం పెట్టి.. ‘మేము వృద్ధాశ్రమానికి వెళ్లిపోతున్నాం’ అంటారు ఇద్దరూ. ఆ మాట విని హిమ, సౌర్య ఇద్దరూ షాక్ అవుతారు. ఏంటి నాన్నమ్మ అని ఇద్దరు అడగడంతో ‘రాత్రి అన్నం తినలేదు,ఇప్పుడు టిఫన్ తినలేదు. అందుకే మేము వెళ్లిపోతున్నాం’ అంటుంది సౌందర్య. ‘అవును, సౌందర్య మరి అక్కడ దోమలుంటాయా’ అంటాడు ఆనందరావు పేలగా ముఖం పెట్టి. ‘ఉంటాయండి.. కానీ ఈ మనవరాల బాధకంటే అవే బెటర్’ అంటుంది సౌందర్య చాలా సీరియస్గా ముఖం పెట్టి.
అది నిజమే అంటాడు. సరే సౌర్య మమ్మల్ని చూడాలని అనిపిస్తే.. ఒక బ్రెడ్ ప్యాకెట్, రెండు దానిమ్మకాయలు తప్పకుండా తీసుకునిరామ్మా’ అంటాడు ఆనందరావు బాధగా. ‘తాతయ్యా ఏంటిప్పుడు తినాలి అంతే కదా అంటుంది సౌర్య. ‘మీరు వెళ్లడానికి వీల్లేదు’ అంటుంది హిమ. భోజనం కూడా ఇద్దరు కలిసే తినాలి’ అంటుంది సౌందర్య. ‘సరే.. ఆకలేస్తుంది రండి అంటు బ్యాగ్స్ లోపల పెట్టి భోజనం తింటారు.
శోభ ప్లాన్ ఏంటి..?
మరోవైపు శోభ మనసులో రగిలిపోతూ ఉంటుంది. ‘నేనేం చెయ్యలేకపోతున్నా.. హిమ, నిరుపమ్ ఒక్కటైపోయేలా ఉన్నారు’ అనుకుంటూ ఉంటుంది.ఇంతలో బ్యాంక్ మేనేజర్ కాల్ చేస్తాడు. ‘మేడమ్ మీరు ఈఎమ్ఐలు తీర్చుకుంటే.. మొత్తం సీజ్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చి పెట్టేస్తాడు. దాంతో శోభ అదే భయంతో స్వప్నకు కాల్ చేస్తుంది. హిమ విషయంలో నిరుపమ్ మారేలా లేడు అంటుంది స్వప్న. ఎలాగోలా ట్రై చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది స్వప్న. దాంతో శోభ మరింతగా రగిలిపోతుంది.
బోనాలకు రమ్మని సౌందర్యను ఆహ్వానించిన చంద్రమ్మ
ఇక సౌందర్య, ఆనందరావుల ఇంటికి చంద్రమ్మ వస్తుంది.చంద్రమ్మతో సౌందర్య వాళ్లు చాలా ప్రేమగా అభిమానంగా మాట్లాడతారు. సౌర్యని కన్నబిడ్డలా చూసుకున్నందుకు కృతజ్ఞతలు చెబుతారు. ఇంతలో సౌర్య, హిమ బయటికి వస్తారు. సౌర్య ప్రేమగా పిన్నీ అంటూ హగ్ చేసుకుంటుంది చంద్రమ్మని. ఇక మాట సందర్భంలో చంద్రమ్మ.. ‘బోనాలు చేస్తున్నాం. మిమ్మల్ని ఆహ్వానించాలనే వచ్చానమ్మా’ అంటుంది. ‘అయితే నేను ఈసారి బోనం ఎత్తుతాను. నా మనవరాలు నా ఇంటికి వచ్చింది. ఈ రకంగానైైనా అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పినట్లు ఉంటుంది’ అంటుంది సౌందర్య.అంతా వస్తాం అని చెప్పడంతో చంద్రమ్మ వెళ్ళిపోతుంది.. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!