ఆగస్టు 6 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

ఆగస్టు 6 – శ్రావణమాసం – శనివారం
మేషం
దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో దైవ చింతన పెరుగుతుంది వ్యాపారాలు అంతగా కలిసిరావు. దీర్ఘ కాలిక ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి.


వృషభం
చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలత కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి.ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి.
మిధునం
వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు.కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
కర్కాటకం
కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత చికాకు తప్పదు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
సింహం
ఉద్యోమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది. బంధువులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తల్లి తండ్రుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.
కన్య
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితుల నుండి ఊహించని ధనలాభం కలుగుతుంది. వృత్తి ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు.
తుల
ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. వ్యాపారమునకు పెట్టుబడులు సకాలంలో అందవు.
వృశ్చికం
ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం. వృత్తి వ్యాపారములు పుంజుకుంటాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.
ధనస్సు
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
మకరం
ఉద్యోగ విషయమై ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సన్నిహితుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు.
కుంభం
ఆకస్మిక ధన లాభాలుంటాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. స్ధిరాస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు.
మీనం
నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల నుండి మాటలు పడవలసి వస్తుంది. తగినంత ఆదాయం లభించదు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో …


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

7 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago