33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscope: మార్చి 13 – పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: మార్చి 13 – సోమవారం – పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు                                                  మేషం
సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున ఊహించని మార్పులు ఉంటాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం
ధన వ్యవహారాలు కలసివస్తాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.
మిధునం
అవసరానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
సింహం
ఉద్యోగులు చేయని పనికి నిందలు పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.                                                                              కన్య
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
తుల
ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. స్ధిరాస్తి సంబంధిత వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.
వృశ్చికం
కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
ధనస్సు
వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. అనుకున్న సమయానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.
మకరం
కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక ఋణ సమస్యలు నుండి బయట పడతారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.
కుంభం
నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.
మీనం
ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో …


Share

Related posts

డబ్బు పిచ్చి ఉన్నవాళ్లకి ఇది షేర్ చేసి తీరాల్సిందే !

Kumar

Today Horoscope: మార్చి 18 – ఫాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

Today Horoscope: మార్చి 12 – ఫాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma