29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscope: మార్చి 14 – పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: మార్చి 14 – మంగళవారం – పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు

మేషం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ స్థానచలన సూచనలున్నవి.

Today Horoscope
Today Horoscope

వృషభం
వ్యాపారమున పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. దైవదర్శనాలు చేయనుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మిధునం
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటకం
బందు వర్గంతో వివాదాలుంటాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి.
సింహం
స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఇంటాబయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆకస్మిక ప్రయాణా సూచనలున్నవి.
కన్య
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.
తుల
దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత చికాకు పరుస్తాయి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి.
వృశ్చికం
పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.
ధనస్సు
వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు వర్గం నుంచి ధన పరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమౌతారు.
మకరం
వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తొలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం అందుతుంది.
కుంభం
ఉద్యోగులు నూతనోత్సాహం పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
మీనం
వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ధనదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పూరైన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..ట్విస్ట్ ఏమిటంటే..?


Share

Related posts

Today Horoscope: మే 9 – వైశాఖ మాసం – రోజువారీ రాశి ఫలాలు

somaraju sharma

lemon Lamp: రాహుకాల నిమ్మకాయ దీపం ఇంట్లో వెలిగించాలి అంటే ఈ నియమం కచ్చితం గా పాటించాలి!!

siddhu

Today Horoscope: జనవరి 24 – పుష్యమాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma