గిన్నిస్ రికార్డుకు పోలవరం

 Polavaram

పోలవరం పనులు గిన్నిస్ రికార్డులలో చోటు చేసుకోనున్నాయా. ఏపీ సర్కార్ అవుననే అంటోంది. బహుళార్ధసార్ధక ప్రాజెక్టు పోలవరం పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి ప్రతి సోమవారం పోలవరం పనులపై సమీక్షలు నిర్వహిస్తూ పనులను పర్యవేక్షించడమే కాకుండా అధికారులను పరుగులెత్తిస్తున్నారు.

జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ పోలవరం నిధుల విడుదలలో కేంద్రం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ఖజానా నుంచే నిధులు మళ్లీస్తూ పోలవరం పనులు ఆగకుండా ఏపీ సీఎం అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పనుల వేగం ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా పోలవరం పనులకు గిన్నిస్ రికార్డులలో స్థానం కోసం ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. స్పిల్ వేలో 28వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను 24 గంటల వ్యవధిలో పూర్తి చేసేందుకు అవసరమైన సన్నాహకాలన్నీ చేసిన ఇరిగేషన్ శాఖ ఈ పనులకు గిన్నిస్ రికార్డులో స్థానం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ కాంట్రీక్ పనులు జరగనున్నాయి.