NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

108 సర్వీసుల మార్పునకు ఇదీ కారణమేనా..??

జీవీకె గ్రూపు అందరికీ బాగా సుపరిచితమే. చంద్రబాబు హయాంలో గత ప్రభుత్వంలో ద్వారా జేవీకె గ్రూపు ద్వారా రాష్ట్రంలో 108 అంబులెన్సు సర్వీసు నడిచాయి. 108 అనే అంబులెన్సు సర్వీసులను దాదాపు కొనఊపిరికి తీసుకువెళ్లిన ఘనత ఈ సంస్థ కే దక్కుతుంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుండి ఒప్పందం కుదుర్చుకొని బిల్లు లు తీసుకున్న తర్వాత కూడా సేవలు సరిగా నిర్వహించ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దానిలో గత ప్రభుత్వ వైఫల్యంతో పాటు ఈ జేవీకే సంస్థ కూడా పంచుకుంది. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత 108 వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా జేవీకే ను తప్పించి అరబిందో కు అప్పగించారు. తాజాగా ఈ జేవీకె సంస్థ అనేక కేసులు ఎదుర్కొంటున్నది. సుమారు 705 కోట్ల రూపాయలను దారి మళ్లించారనే ఆరోపణలతో సిబిఐ కేసును ఎదుర్కొంటోంది.

ముంబయి ఎయిర్ పోర్టులో రూ.705 కోట్ల మేర ఆర్థిక అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జీవీకే గ్రూప్ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ముంబయి, హైదరాబాద్ నగరాల్లో జీవీకే గ్రూప్ అధినేత జీవీకే రెడ్డి, ఆయన తనయుడు జీవీ సంజయ్ రెడ్డికి చెందిన పలు కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం అనుసరించి ఈ తనిఖీలు చేపట్టారు. ఎయిర్ పోర్టు కుంభకోణానికి సంబంధించి జీవీకే ప్రమోటర్లపై మనీలాండరింగ్ కేసు కూడా నమోదైంది. అంతకు ముందు ఈ వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేయగా, తదుపరి ఈడీ కూడా రంగప్రవేశం చేసింది.

సోదాల్లో కొన్ని ముఖ్యమైన పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు సీజ్ చేసినట్లు తెలిసింది. ప్రధానంగా ఎంఐఏఎల్ నుండి నిధులు ఎటు మళ్లించారు? ఆ సొమ్ము ఎక్కడికి, ఎలా వెళ్ళింది? అనే అంశాలపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంఐఏఎల్ నిర్వహిస్తుండగా ఎంఐఏఎల్ లో జేవీకెతో పాటు ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N