కమలేష్‌ను చంపింది ముస్లింలే!

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌నం రేపిన హిందూ సమాజ్ పార్టీ చీఫ్ క‌మ‌లేశ్ తివారీ హ‌త్య‌ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ లో ముగ్గురు, పశ్చిమ యూపీలోని బిజ్నోర్ జిల్లాకు చెందిన ఇద్దరు ముస్లిం మతాధికారులను అరెస్టు చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ వెల్లడించారు. నిందుతులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దాడి చేసినట్లు భావిస్తున్న మరో ఇద్దరు ఇంకా పరారీలో ఉన్నారని చెప్పారు. గుజరాత్ పోలీసుల సహకారంతో నిందితులను పట్టుకున్నామని తెలిపారు. గుజరాత్‌లో అరెస్టయిన నిందితులను మౌలానా మొహ్సిన్ షీక్ (24) రషీద్ పఠాన్ (23), ఫైజాన్(21) గా గుర్తించారు.  హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు.

అంతకు ముందు ఈ కేసులో యూపీ పోలీసులు సీసీటీవీ ఫూటేజ్‌ను రిలీజ్ చేశారు. క‌మ‌లేశ్ తివారీ ఇంటి వ‌ద్ద ఉన్న సీసీటీవీలో అనుమానితులు క‌నిపించారు. ఓ మహిళతోపాటు ఇద్దరు వ్యక్తులు దీపావ‌ళి స్వీటు బాక్సులతో క‌మ‌లేశ్ ఇంటికి నిందితులు వెళ్లారు. కానీ స్వీటు బాక్సుల్లో ఆయుధాలు ఉన్న‌ట్లు గుర్తించారు. కమలేశ్ లక్నోలోని తన కార్యాలయంలో ఉండగా శుక్రవారం మధ్యాహ్నం కొందరు కాషాయ వస్త్రాలు ధరించి లోపలికి వచ్చారు. రెండు స్వీట్ బాక్సులు తమ వెంట తీసుకొచ్చారు. అందుల్లోంచి తుపాకీ తీసి కాల్చారు. తర్వాత కత్తితో గొంతు కోశారు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. హత్య అనంతరం నిందితులు అక్కడినుంచి పారిపోయినట్టు విజువల్‌లో కనిపించింది. సంఘటనస్థలంలో పిస్టోల్, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

2015లో కమలేశ్ తివారీ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ముస్లింలకు కమలేశ్ అంటే గిట్టదు. శుక్రవారం కమలేశ్‌ను మట్టుబెట్టింది కూడా ముస్లింలే అని తెలుస్తోంది. నిజానికి క‌మ‌లేశ్ వ‌ద్ద ఇద్ద‌రు సెక్యూర్టీ గార్డులు ఉంటారు. అయితే, హ‌త్య జ‌రిగిన రోజు మాత్రం వారు లేరు. హ‌త్యా ఘ‌ట‌న‌పై రిపోర్ట్ ఇవ్వాల‌ని సీఎం యోగి ఆదేశించారు. త‌న భ‌ర్త‌ను చంపిన వారిని శిక్షించ‌కుంటే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని క‌మలేశ్ భార్య కిర‌ణ్ తివారీ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ను హెచ్చరించారు.