పిల్లాడు కాదు.. పిడుగు

ఈ బుడతడు చేసిన పని చూస్తే మీరే వావ్ అంటారు. తెలంగాణకు చెందిన ఎనిమిదేళ్ల సామన్యు పోతరాజు అనే ఈ బాలుడు తన తల్లి, అక్కలతో పాటు మరో ఐదుగురితో కలిసి ఆస్ట్రేలియాలోని అతి ఎత్తైన కస్చూస్కో (Kosciuszko) పర్వతాన్ని ఇట్టే ఎక్కేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. డిసెంబర్ 12న పోతరాజు ఈ సాహసం చేశాడు. అంతేసి ఎత్తైన పర్వతం అధిరోహించాక చిరునవ్వులు చిందిస్తున్న కేసీఆర్ చిత్రపటం ప్రదర్శిస్తూ ఫోటోలు కూడా దిగాడు. ఇప్పటికే తాను 4 పర్వతాలు ఎక్కానని, త్వరలోనే జపాన్ లోని మౌంట్ ఫుజీ పర్వతాన్ని కూడా అధిరోహిస్తానని చెప్పాడు. పెద్దయ్యాక తనకు పైలట్ కావాలనుందని చెబుతున్నాడీ పిడుగు.