మరంణం తర్వాత కేసు కొట్టివేత

నాసిక్(మహారాష్ర్ట), డిసెంబరు 31 : నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గి మీద కేసును నాసిక్ కోర్టు సోమవారం కొట్టివేసింది. పలు రాష్ట్రాలకు విస్తరించిన నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో ఒక కోర్టు అతనికి 30 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తూ తెల్గీ అనారోగ్యంతో గత ఏడాది మరణించాడు. 16 ఏళ్ళపాటు తెల్గీ జైల్లోనే గడిపాడు. మరణాంతరం అతనిపై ఉన్న ఇతర కేసుల్లో అభియోగాలను తొలగించారు.నాసిక్ కోర్టు ఈ కేసులో తెల్గీతోపాటు మిగిలిన మరో ఏడుగురు నిందితులపై పెట్టిన అభియోగాలను కొట్టివేసింది.