NewsOrbit
టాప్ స్టోరీస్

మంచి వాతావరణం కోసం చారిత్రాత్మక నిరసన!

న్యూయార్క్ నగరంలో నిరసన ప్రదర్శనను ఉద్దేశించి ప్రసంగిస్తున్న స్వీడిష్ కార్యకర్త గ్రేటా తున్‌బెర్గ్

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

భూతాపం సమస్యను తక్షణం పట్టించుకుని పరిష్కారాలు వెదకాలని ప్రపంచ దేశాల నాయకులను కోరుతూ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రదర్శనలు జరిగాయి. స్వీడిష్ టీనేజి కార్యకర్త గ్రేటా తున్‌బెర్గ్ స్ఫూర్తితో జరిగిన ఈ ప్రదర్శన ప్రపంచ చరిత్రలోనే పెద్ద వాతావరణ మార్పు నిరసన.

12 నెలల క్రితం గ్రేటా తున్‌బెర్గ్ పర్యావరణం పరిరక్షణ కోసం ఉద్యమం మొదలుపెట్టింది. గత సంవత్సరం ఆగస్టులో ఒక రోజు స్కూలు మానేసి భూతాపం తగ్గించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వీడన్ పార్లమెంట్ ముందు ప్లకార్డు పట్టుకుని నుంచుంది. ఆనాటి నుంచి వాతావరణం కోసం స్కూలు సమ్మె ఉద్యమం ప్రపంచంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉంది.

శుక్రవారం నాటి నిరసన ప్రదర్శనలో కూడా పిల్లలు, యువతీ యువకులే పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమం మొదలయిన తర్వాత తొలిసారిగా పెద్దలను కూడా ఆహ్వానించారు. ఫలితంగా లక్షలాది మంది సభ్యులుగా  ఉన్న అనేక ట్రేడ్ యూనియన్లు నిరసనలో పాల్గొన్నాయి. కార్మికులు, వైద్యులు, నర్సులు..ఒ   కరేమిటి అన్ని రంగాల వారూ చేయి కలిపారు. అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలలో పని చేసే ఉద్యోగులు నిరసనలో పాలు పంచుకునేందుకు బయటకు నడిచారు.

మొత్తం మీద 185 దేశాల్లో ఈ ప్రదర్శనలు జరిగాయి. ఎక్కడికక్కడ తమ స్థానిక సమస్యలపై ప్రజలు నినదించారు. ఉదాహరణకు సాలమన్ దీవుల్లో సముద్రమట్టం పెరగడంపై, దక్షిణాఫ్రికాలో విషతుల్యమైన వ్యర్ధాలపై, భారతదేశంలో వాతావరణ కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్ధాల సమస్యలపై స్పందించారు. స్థూలంగా అన్నిదేశాల నుంచీ వచ్చిన సందేశం ఒక్కటే: భూతాపానికి కారణమవుతున్న కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువుల సంగతి తక్షణం చూడండి.

ఐక్యరాజ్యసమితిలో వచ్చే సోమవారం వాతావరణ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. భూఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న పారిస్ శిఖరాగ్ర సమావేశం లక్ష్యానికి కట్టుబడే విధంగా ప్రపంచ దేశాల నుంచి హామీలు తీసుకోవడం కోసం సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

బరాక్ ఒబామా హయాంలో పారిస్ సమ్మిట్ ఒప్పందంపై అమెరికా సంతకం చేస్తే తర్వాత వచ్చిన డొనాల్డ్ ట్రంప్ దాని నుంచి బయటకు నడిచారు. సోమవారం నాటి శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ట్రంప్ సమితిలోనే ఉంటారు కానీ ఆయన ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించరు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.

 

శుక్రవారం నాటి చారిత్రాత్మక నిరసన ప్రదర్శనపై ‘ద గార్డియన్’ పత్రిక రూపొందించిన వీడియో చూడండి:

author avatar
Siva Prasad

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment