భోపాల్: మధ్యప్రదేశ్ లో కురిసిన కుండపోత వర్షం ధాటికి భారీగా వరద నీరు పోటెత్తింది. మంద్ సౌర్ జిల్లా నౌగాన్ గ్రామంలో వరదలు ముంచెత్తాయి. దీంతో గురువారం ఓ మహిళ మృతి దేహాన్ని అంతిమయాత్ర చేసేందుకు గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. గ్రామానికి సమీపంలో ప్రమాదకరంగా ఉన్న నాలాపై నుంచి వరద నీరు పోతున్నా.. వేరే దారి లేకపోవడంతో గ్రామస్థులు నాలాపై నుంచి వెళ్లారు. వరద నీటిలో నుంచి వెళ్తూ మహిళ అంతిమయాత్ర నిర్వహించారు. ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశామని, అయినా తమ గోడును పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
#WATCH Madhya Pradesh: Residents of Naugaon village in Mandsaur district carry the body of a woman through a flooded nallah, for her last rites. Villagers say that though they had requested the administration multiple times for a bridge, their requests were never heard.(03.10.19) pic.twitter.com/v3AxXQK3UB
— ANI (@ANI) October 3, 2019
గత కొద్ది రోజులుగా ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల ప్రభావంతో పలు బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. వరదల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలోనే జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తగా.. భోపాల్, మాండ్ సౌర్ జిల్లాలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచాయి.