(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
డిస్కవరీ ఛానల్లో ప్రసారం అయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కనిపించనున్నారు. బ్రిటీష్ సాహసికుడు బేర్ గ్రిల్స్ .. మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో కోసం రజనీతో సాహస యాత్ర చేస్తూ ఇంటర్వ్యూ చేయనున్నారు. ఇటీవల ప్రధాని మోదీతో కలిసి ఉత్తరాఖండ్‌లో ఓ షో చేసిన గ్రిల్స్.. ఇప్పుడు రజనీతోనూ షో చేస్తున్నాడు. ఈ కార్యక్రమం కోసం బేర్ గ్రిల్స్ కర్ణాటక వచ్చారు. ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్నాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరుగనుంది. ఈ డాక్యుమెంటరీ షూటింగ్‌కు రజనీ అక్కడ రెండు రోజులుపాటు అక్కడే ఉంటారు.
Superstar #Rajinikanth shooting #ManVsWild with @BearGrylls at #Bandipur forest
— Shabbir Ahmed (@Ahmedshabbir20) January 28, 2020
British adventurer Bear Grylls arrives at Bandipur forest in Karnataka for a shoot with actor Rajinikanth for an episode of his show 'Man vs Wild'. pic.twitter.com/mIkSrOARSz
— ANI (@ANI) January 28, 2020
గతంలో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ ప్రోగ్రామ్ యాంకర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్‌లో సాహసయాత్ర చేశారు. ఇప్పుడు ఇదే కార్యక్రమానికి తమిళ నటుడు రజనీకాంత్ హాజరుకానున్నారు. ఈ షోలో ఇంతకు ముందు మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా పాల్గొని బేర్ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేశారు. కాగా, మేన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో మోదీ తర్వాత పాల్గొన్న రెండో భారతీయ వ్యక్తిగా రజనీ నిలిచారు. ఈ కార్యక్రమం కోసం రజనీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మేన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో బేర్ గ్రిల్స్.. అడవులు, నదులు, కొండల్లో తిరుగుతూ… సాహసాలు చేస్తుంటాడు. ఎలాంటి సదుపాయాలూ, ఆహారమూ లేకపోయినా అడవుల్లో, ఎడారుల్లో ఎలా బతకగలగాలో చూపిస్తుంటాడు. అందులో భాగంగా ప్రకృతిలో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదురించాలో వివరిస్తాడు. అందుకే ఈ షోకి మంచి ఆదరణ ఉంది.
Modi ya follow panraru dawww nu inum oru masathuku kadaruvanuga ???
— இந்தியத்தமிழன் (@thennatusingam) January 28, 2020
பந்திப்பூரில் தலைவர்????#manvswild #ThalivarRajinikanth pic.twitter.com/m4cTlXty2z
— RajaS✨ (@JsvRaja) January 28, 2020
Must mention "Second Indian Superstar"
— §@qib ¦mran (@saquibIM) January 28, 2020