NewsOrbit
టాప్ స్టోరీస్

దీపావళికి ముందే ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

Share

(న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని నవంబర్ 4న తిరిగి పెను కాలుష్యం కమ్మేసింది. ట్రాఫిక్ రద్దీతో పాటు పక్క రాష్ట్రాల్లో పంట పొలాల దుబ్బును రైతులు మంటలుపెట్టి తగల బెడుతుండడంతో ఢిల్లీపై పొగ మేఘాలు ఆవరించాయి. దీంతో ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది. పొగ కమ్ముకోవడంతో ట్రాఫిక్ కూడా సైతం స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. దీపావళికి ముందే ఢిల్లీలో కాలుష్యం మోతాదు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీపావళి తర్వాత నవంబర్ 8నాటికి ఢిల్లీ వాతావరణం పరిస్థితి మరింత దిగజారగలదని Air Quality Forecasting and Research (SAFAR) హెచ్చరించింది.

నవంబర్ 1 నుండి ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణకు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. కాలుష్యం కాస్త తగ్గినట్లే కనిపించినా గత నాలుగు రోజుల్లో మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయింది. సోమవారం చాందినీ చౌక్‌ వద్ద అత్యధికంగా కాలుష్యం నమోదైంది.

ఎయిర్ క్వాలిటీని పీఎం 10 ప్రమాణాలను ఉపయోగించి కొలుస్తారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలను అనుసరించి వాయు నాణ్యత 0–50 వరకు (పిఎం 10) ఉంటే దానిని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. 51 నుంచి 100 వరకుంటే సంతృప్తికరంగాను, 101- 200 వరకు ఉంటే ఫర్వాలేదనీ భావిస్తారు. కానీ 201- 300 మధ్య కనుక ఉంటే అది వాంఛనీయం కాదు. అదే 301-400 వరకు కాలుష్య మోతాదు నమోదైతే తీవ్రమైనదిగా పరిగణిస్తారు. 401- 500 వరకు ఉండే కాలుష్యం అత్యంత తీవ్రమైనదని అర్థం. ప్రస్తుతం ఢిల్లీలో దీపావళినాడు ఇది 575కు చేరుకుంటుందని అంచనా.

పొరుగు రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్‌‌లలో పంటల దుబ్బును విచక్షణారహితంగా తగలబెట్టడం వల్ల ఢిల్లీ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీపావళి కూడా వస్తుండడంతో ఇది మరింత పెరిగిపోయే పరిస్థితి నెలకొంది.

దీవావళినాడు రాత్రి 8-10 గంటల మధ్యే బాణాసంచా కాల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఇప్పటికే పోలీసులు 29 కేసులను నమోదు చేశారు. కొందరిని అరెస్టు కూడా చేశారు.


Share

Related posts

8న క్యాబినెట్ విస్తరణ!?

somaraju sharma

మిస్సైన లా విద్యార్థిని ఆచూకీ లభ్యం

Mahesh

బీజేపీతో శిరోమణి అకాలీదళ్ దోస్తి కటీఫ్?

Mahesh

Leave a Comment