టాప్ స్టోరీస్

సింధుకి బిఎండబ్ల్యు కారు

Share

 

హైదరాబాద్: స్వర్ణ పతకం సాధించి తొలి భారత షట్లర్‌గా రికార్డు నెలకొల్పిన పివి సింధుకు ప్రముఖుల నుండి ప్రశంసలు, నజరానాలు అందుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోది, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. కొందరు ప్రముఖులు భారీ నజరానాలు ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరీనాధ్ శనివారం అక్కినేని నాగార్జున చేతుల మీదుగా సింధుకు బిఎండబ్ల్యు కారును బహుకరించారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో కారును నాగార్జున అందజేసి అభినందనలు తెలిపారు.

కర్నాటకలో దసరా ఉత్సవాలకు ఆహ్వానం

స్టార్ షట్లర్ పివి సింధుకు కర్నాటక ప్రభుత్వం నుండి ఆహ్వానం అందింది. మైసూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప  లేఖ రాశారు. ఈ లేఖను శనివారం మైసూర్ ఎంపి ప్రతాప్ సింహా, ఎస్‌పి రిష్వంత్‌ హైదరాబాద్ వచ్చి సింధుకు అందజేశారు.

దసరా సందర్భంగా మైసూర్‌లో భారీ ఎత్తున ఉత్సావాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ ఉత్సవాలకు ఎంతో మంది ప్రముఖులు హజరు కానున్నారు. కర్నాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు మైసూర్‌లో దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు తన తల్లిదండులతో కలిసి వెళ్లనున్నట్లు పివి సింధు తెలిపారు.

 


Share

Related posts

మీరు ఉండాల్సిందే!

Siva Prasad

‘శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టం చేయండి’

Mahesh

మా కమిషనర్ మంచోడు

somaraju sharma

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar