‘అక్కడ ఎక్కువ దోపిడీ చెయ్యొచ్చు, అందుకే..’!

Share

గుంటూరు: దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం ఆయనతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు కార్యాచరణ,బిజెపి మద్దతుపై సమాలోచనలు జరిపారు. సమావేశం అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. దోచుకోవడానికి అమరావతిలో ఏమీ లేదని, విశాఖలో దోపిడీకి ఎక్కువ ఆస్కారం ఉందనే రాజధాని మార్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రజా క్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదని, ఎంత సేపూ యథేచ్ఛగా దోచుకోవడం గురించే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు కార్పోరేట్ కంపెనీల చేతుల్లో ఏపీ ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం విస్మరిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ విధానాలతో గత 50 రోజులుగా రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని అన్నారు. అవినీతి తప్ప ప్రభుత్వానికి వేరే ఆలోచన లేదని దుయ్యబట్టారు. విశాఖ రాజధాని గురించి ఉత్తరాంధ్రలో కూడా సానుకూలంగా లేరని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అమరావతినే  రాజధానిగా  కొనసాగించాలని కోరుతున్నారని చెప్పారు. రాజధాని వస్తే తమకు సమస్యలు వస్తాయని అక్కడి ప్రజలు భయంతో ఉన్నారని చెప్పారు. రాజధాని 29 గ్రామాల సమస్య కాదని,  రాష్ట్ర అభివృద్ధికీ సంబంధించినదని కన్నా అన్నారు. గత సీఎం చంద్రబాబు ఇక్కడి రైతుల భూములు తీసుకుని రియల్ వ్యాపారం చేయాలని భావించారని విమర్శించారు. వైసీపీ అధిరంలోకి వచ్చాక ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ చార్జీలు పెట్రో ఛార్జీలు పెంచారని అన్నారు. ప్రజల రక్తం పీల్చేలా వైసీపీ పాలన సాగుతోందని విమర్శించారు. రాజధాని అమరావతిలో ఉండేలా తాము  పోరాడుతామని అమరావతి రైతులకు కన్నా భరోసా ఇచ్చారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

25 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

34 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago