బిహార్ వ‌ర‌ద బాధితుల‌కు అమితాబ్ సాయం

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బీ బిహార్ వ‌ర‌దబాధితుల‌కు 51 ల‌క్ష‌ల రూపాయ‌లను విరాళంగా అందించారు. కొన్ని రోజుల క్రితం ఉత్త‌ర ప్ర‌దేశ్ రైతుల రుణాల‌ను తీర్చి పెద్ద మ‌న‌సు చాటుకున్న అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు. వ‌ర‌ద‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న బిహార్ ప్ర‌జ‌ల‌కు త‌న వంతుగా ఆర్థిక‌ సాయం అందించారు. ముఖ్య‌మంత్రి సహాయ నిధికి రూ.51 లక్ష‌లు విరాళాన్ని చెక్ రూపంలో అందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌కు లేఖ రాశారు. `ప్ర‌కృతి వైప‌రీత్యం వ‌ల్ల రాష్ట్రం దెబ్బ తిన‌డం చూస్తుంటే చాలా బాధ‌గా ఉంది. బాధితుల‌కు నా సానుభూతిని తెలియ‌జేస్తున్నాను“ అని తెలిపారు అమితాబ్‌. గ‌త కొన్నిరోజులుగా బిహార్‌లో ప‌డుతున్న భారీ వ‌ర్షాలు కార‌ణంగా 15 జిల్లాలోని 1400 గ్రామ ప్ర‌జలు న‌ష్ట‌పోయారు. 73 మంది ప్రాణాల‌ను కోల్పోగా.. 20 ల‌క్ష‌ల మంది నిరాశ్ర‌యుల‌య్యారు.