NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

సోము..  నెమ్మదిగా వేసేశారుగా..!!

 

(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఇప్పటి వరకూ ఏపి బిజెపి అధ్యక్షుడుగా నియమితులైన సోము వీర్రాజు అధికార వైసీపీకి కాస్త అనుకూలమనీ, టీడీపీకి బద్ద విరోధి అన్నట్లుగా రాష్ట్రంలో ప్రచారం జరిగింది. అయితే సోము వీర్రాజు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారనీ, అవసరమైతే వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి సైతం వెనుకాడరని తాజా సంఘటనలు బట్టి చూస్తుంటే అర్థం అవుతోంది.

somu veerraju

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీనర్శింహ స్వామి వారి రథం దగ్ధం సంఘటనను పురస్కరించుకుని ఏపి బిజెపి చీఫ్ సోము వీర్రాజు సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హిందూత్వంపై దాడులు పెరిగాయని మండిపడ్డారు సోము వీర్రాజు. అంతర్వేదిలో ఆలయ రథం దగ్ధంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు సోము వీర్రాజు. హిందూత్వంపై దాడులను బి జె పి సహించదని స్పష్టం చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన ప్రతి సారి పిచ్చవాళ్లు చేసిన పని, పిచ్చి చేష్టలు అంటూ తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు సోము వీర్రాజు, హిందూ దేవాలయాలంటే పిచ్చవాళ్లకు ఆట స్థలాలా అని ప్రశ్నించారు. అంతర్వేది ఘటనలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం జగన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.

పనిలో పనిగా టీడీపీపైనా విమర్శలు గుప్పించారు సోము వీర్రాజు. అంతర్వేది ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. కృష్ణా పుష్కరాల పనుల పేరిట విజయవాడలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక దేవాలయాలను కూల్చివేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ హిందూత్వంపై ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇదే సందర్భంలో రాజధాని విషయంపైనా మాట్లాడారు. తమకు అధికారం ఇస్తే 64 వేల ప్లాట్ లు రైతులకు ఇచ్చేసి తొమ్మిది వేల ఎకరాల్లోనే రాజధాని నిర్మించి చూపిస్తామని అన్నారు సోము వీర్రాజు.

author avatar
Special Bureau

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?