NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఏపి బీజేపీలో విభేదాలు.. మూడు రాజధానుల వ్యవహారంతో రగులుకుంటున్న అగ్గి.. !!

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్న సామెతగా తయారు అయ్యింది రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని అధికార వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు అన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా బీజేపీ, జనసేన, సిపిఐ, సీపీఎం తదితర పార్టీలు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని మొదటి నుండి డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతాంగానికి సంఘీభావం కూడా తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకుల్లో రాజధాని విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. అమరావతిలో రాజధాని కొరకు భూములు ఇచ్చిన రైతాంగానికి సంఘీభావం తెలిపారు. అమరావతికి మద్దతుగా రాష్ట్ర కమిటీ తీర్మానం కూడా ఆమోదించింది. బీజేపీ నేతలు మద్దతు తెలియచేయడంతో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున తమకు న్యాయం జరుగుతుందని అమరావతి ప్రాంత రైతాంగం ఇప్పటి వరకు ఆశతో ఉన్నారు. అయితే మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంతో బీజేపీపై అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉంచితే..

మూడు రాజధానుల అంశంపై బీజేపీ నేతల మధ్య అగ్గి రాజుకొంటోంది. నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. బీజేపీ నూతన అధ్యక్షుడుగా నియమితులైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. అమరావతి విషయంలో బీజేపీ స్టాండ్ లో ఎటువంటి మార్పు లేదని, రైతులకు అండగా ఉంటామని చెబుతూనే మరో పక్క కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేస్తున్నారు. అదే పార్టీ ఎంపి సుజనా చౌదరి.. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, రాజధాని అంగుళం కూడా కదలదు అంటూ మరో సారి స్పష్టం చేయడంతో రాష్ట్ర బీజేపీ వెంటనే స్పందించి ట్విట్టర్ వేదికగా సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండించింది. అది ఆయన వ్యక్తి గత అభిప్రాయం అని కూడా కొట్టి పారెయ్యడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అమరావతికి అనుకూలంగా కొందరు, మూడు రాజధానులకు అనుకూలంగా మరి కొందరు బీజేపీ నాయకులు గళం విప్పుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju