NewsOrbit
టాప్ స్టోరీస్

రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నేతల అరెస్ట్

Amaravathi 500 Days: last Game in Delhi Analysis

Amaravathi 500 Days: last Game in Delhi Analysisఅమరావతి: రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.శుక్రవారం ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గగుడికి రైతులు పాదయాత్ర తలపెట్టారు. కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులను లాఠీలతో చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. లాఠీచార్జ్‌లో పలువురు మహిళా రైతులకు గాయాలయ్యాయి.

రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 24వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో పూజలు నిర్వహించి అనంతరం పొంగళ్లను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలని రైతులు నిర్ణయించారు. దీంతో రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. పలువురు రైతు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

విజయవాడలో పాదయాత్రకు అనుమతి లేదని… 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమలులో ఉన్నందున ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు తెలిపారు. 29 గ్రామాల ప్రధాన కూడళ్ళలో ముళ్ల కంచెల ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతుల బయటకు రాకుండా భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి. తుళ్లూరులో పది మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుళ్లూరు రహదారిపై ధర్నా, టెంట్ వేయవద్దని ఆదేశించారు.  పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ పాదయాత్ర చేసి తీరుతామని రైతులు, రైతు కూలీలు స్పష్టం చేశారు. పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు.

మరోవైపు రాజధాని రైతుల ర్యాలీలో పాల్గొనకుండా టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు సహా పలువురిని గృహ నిర్బంధం చేశారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లోని అమరావతి జేఏసీ ఆఫీసుకు తాళాలు వేశారు. జేఏసీ ఆఫీసు గేటు ఎదుట పోలీసులు వాహనాలను అడ్డుగా పెట్టారు. ఇంతవరకూ విపక్షాల నిరసనలకు వేదికగా ఉన్న వేదిక కల్యాణ మండపంనే జేఏసీ కేంద్ర కార్యాలయంగా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో పటమట పోలీసులు వచ్చి ఫంక్షన్ హాల్ కు తాళం వేసి, యజమాని చెన్నుపాటి వజీర్ కు నోటీసులు ఇచ్చారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment