ఢిల్లీలో సీఎం జగన్ బిజీ బిజీ…!

ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో తాజా అంశాలకు సంబంధించి కేంద్రం మద్దతు కోరుతూ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రెండు రోజుల కిందట ప్రధాని మోడీతో భేటీ అయినా జగన్ నిన్న రాత్రి హోమ్ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య 40 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. నేడు కేంద్ర మంత్రి రవి శంకర్ తో భేటీ అయ్యారు. రాజధాని వికేంద్రీకరణ, హైకోర్టు తరలింపు, శాసనమండలి రద్దు అంశాలకు సంబంధించి న్యాయపరమైన అంశాలను చర్చిస్తున్నారు. అనంతరం మరి కొందరు కేంద్ర మంత్రులతోనూ జగన్ భేటీ కానున్నట్టు సమాచారం.