అమరావతి : అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అన్నారు. నేడు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజధాని అంశం పై అయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లోనే నం.1 నగరమని, విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయినీ జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం మన పిల్లలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లే అవసరం ఉండకూడదన్నారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు అమరావతి రాజధాని ప్రకటన ముందే భూములు కొనుగోలు చేసారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో అయిదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి 1.09,000 కోట్ల రూపాయలు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్పాయిన్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుంది.అమరావతిలోనూ అభివృద్ధి కొనసాగుతుంది’ అని జగన్ చెప్పారు.
అమరావతిపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.’ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ ఉంటుంది. అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం, హెడ్‌వోడీ, సచివాలయం’ ఉంటాయి అని చెప్పారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. రాజధాని గురించి ‘బాహుబలి’ లాంటి గ్రాఫిక్స్ చూపాలని తాను అనుకోవట్లేదని జగన్ అన్నారు.
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…