అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజధాని ప్రాంత అభివృద్ధిపై సిఆర్‌డిఎ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం, సిఆర్‌డిఎ కమిషనర్ లక్ష్మీనరసింహం, సిఆర్‌డిఎ ఇంజనీర్‌లు, ఉన్నతాధికారులు హజరయ్యారు. అమరావతి బృహత్ ప్రణాళికతో సహా వివిధ నిర్మాణాలపై అధికారులతో జగన్ చర్చిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం, భూముల కేటాయింపు, నిర్మాణాల ప్రగతి తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు. రాజధాని భూసేకరణ ప్రక్రియ, నిర్మాణాలు, భూకేటాయింపులపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.