NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ కు కొత్త సలహాదారుడొచ్చారోచ్చ్..!!

 

ఏపిs ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి దాదాపు 30మంది వరకూ సలహాదారులు ఉన్నారు. జగన్మోహనరెడ్డికి ఉన్నంత మంది సలహాదారులు దేశంలోని ఏ ముఖ్యమంత్రికి లేరు. మన రాష్ట్రంలో కూడా ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రికి ఇంత స్థాయిలో సలహాదారులు లేరు. వైసిపిలో కీలక స్థాయిలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు కొని అనేక మంది ఐఎఎస్ లు, రాజకీయ నాయకులు, మాజీ జర్నిలిస్ట్ లు అందరూ కలిపి 30మంది వరకూ ఉన్నారు. వాళ్ల అందరికీ నెల వచ్చే సరికి రెండున్నర కోట్ల నుండి మూడు కోట్ల వరకూ వేతనంగా చెల్లిస్తున్నారు. అయితే ఈ సలహాదారుల్లోనే విబేధాలు రాజుకోవడంతో కొంత మంది మధ్యలోనే మానేస్తూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇటీవల కె రామచంద్రమూర్తి కూడా సలహదారు పదవికి రాజీనామా చేశారు. తాజాగా జగన్ గారికి మరో సలహదారుడు నియమితులైయ్యారు. సిఎం జగన్ సొంత జిల్లా కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన అంబటి కృష్ణారెడ్డిని వ్యవసాయ సలహాదారుడిగా నియమించారు.

Ap cm ys jagan

 

ఆయన ప్రత్యేకత ఏమిటంటే

కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన అంబటి కృష్ణారెడ్డి వేరుశనగ, వంట నూనెల వ్యాపారం ద్వారా బాగా ఎదిగారు. ఆయనకు పొద్దుటూరులో నూనె మిల్లులు ఉన్నాయి. విద్యార్హత పదవ తరగతి లోపే. కానీ వ్యవసాయ రంగంలో కొత్త ప్రయోగాలు చేసి ఆదర్శ రైతుగా పురస్కారాలు అందుకోలేదు కానీ నూనె వ్యాపారం ద్వారా ప్రముఖులుగా ఎదిగారు. వైఎస్ కుటుంబానికి విధేయుడుగా పేరుంది. ఇటీవల సిఎం జగన్ ఆయనకు జిల్లాా పరిషత్ చైర్మన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ రాజకీయ సమీకరణలో ఆ పదవిని మాజీ ఎమ్మెల్యే అమరనాధ రెడ్డికి కెటాయించినట్లు సమాచారం. ఈ కారణంగా జగన్మోహనరెడ్డి సర్కార్ కృష్ణారెడ్డికి వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమిస్తూ కేబినెట్ హోదా కల్పించారు. జీతం, అలవెన్స్లు కలపి నెలకు లక్షా 76వేల రూపాయలు చెల్లించనున్నారు. ఆయనకు తొమ్మిది మంది సిబ్బందినీ కేటాయించారు.

ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఇలా సలహదారుల పేరిట నెలకు రెండున్నర కోట్ల నుండి మూడు కోట్ల రూపాయలు తగలబెడుతుండటం దేనికి సంకేతం. వీరు ఏమి ఏమి సలహాలు ఇస్తున్నారో, ప్రభుత్వం ఏమి సలహాలు తీసుకుంటుందో, నిజంగా ఈ సలహదారులు సక్రమమైన, మంచి సలహాలు ఇస్తుంటే కోర్టుల్లో ఇన్ని తలనొప్పి వ్యవహారాలు ఎందుకు వస్తాయి అన్నది సామాన్యుల సందేహం. సలహాదారుల పేరిట కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దూబరా చేయడాన్ని మేధావుుల తప్పుబడుతున్నారు. సలహదారుల పేరిట ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంపై ఆ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వని సలహాదారులు ఎందుకు వారిని తీసేసి వారి స్థానంలో న్యాయసలహాదారుల ను ఏర్పాటు చేసుకుంటే మంచిదని కూడా ఉచిత సలహా ఇచ్చారు రఘు రామకృష్ణం రాజు. ఒ పక్క ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేరుస్తూ మంచి పేరును మూటగట్టుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఇటువంటి చర్యలు, కోర్టు తలనొప్పులు విమర్శలకు ఆస్కారం అవుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju