NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

మరిన్ని పెంపులు తప్పవా..? నిధుల వేటకు ఇదేనా మార్గం..!!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టింది మొదలు సంక్షేమ రంగంపైనే అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారనేది అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్న పథకాల అమలుపైనే సిఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనా వేయకుండా ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన హామీల అమలుకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి కరోనా పరిస్థితులు మరింత శాపంగా మరాయి. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రైతు భరోసా, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు, టెలిమెడిసిన్, సున్నా వడ్డీ, జగనన్న విద్యాదీవెన, వాహన మిత్ర, జగనన్న చేదోడు, అమ్మవడి తదితర పథకాల అమలుకు ప్రస్తుతం నిధుల లేమి కారణంగా అప్పులు తీసుకువచ్చి మరీ సంక్షేమ పథకాలను అర్హులకు అందే విధంగా చూస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు అవసరమైన మార్గాలను చూడాలని అధికారులకు సూచించారు.

ఈ నేపథ్యంలో కోవిడ్ కారణంగా పడిపోయిన ఆదాయాన్ని పెంచేందుకు గానూ సహజ వాయువుపై వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ సహజవాయువుపై 14.5 శాతం నుండి 24.5 శాతానికి విలువ అధారిత పన్ను పెంచతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున నిధులు కావాల్సి ఉన్నందు వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ జివోలో పేర్కొన్నది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం అయిదు రకాల పెట్రో ఉత్పత్తులపై విలువ అధారిత పన్ను వసూలు చేస్తున్నది. ముడి చమురుపై 5శాతం మేర, పెట్రోల్ పై 31 శాతంతో పాటు అదనంగా నాలుగు రూపాయల మేర పన్ను వసూలు చేస్తున్నది. డీజిల్ పై 22.5శాతంతో పాటు అదనంగా నాలుగు రూపాయల మేర వ్యాట్ వసూలు, ఎయిర్ టర్బైల్ వ్యూయెల్ పై ఒక శాతం మేర వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ వసూలు చేస్తున్నది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్టు నెలలకు కరోనా కారణఁగా పన్నులపై ఆదాయం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులను కొంత మేర అధిగమించేందుకు సహజ వాయువుపై అదనంగా పది శాతం మేర వ్యాట్ పెంపునకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 4,480 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం 1,323 కోట్ల రూపాయల మాత్రమే ఆదాయం వచ్చింది.

author avatar
Special Bureau

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju