అమరావతి: రాష్ట్రంలోని మచిలీపట్నం పోర్టును వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.
వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఈ నెల 28న ఒక రహస్య జివోను విడుదల చేసింది. అయితే ఏ ప్రభుత్వం అయినా పలు కీలక జీవోలను విడుదల చేసినప్పుడు వాటిని బహిర్గతం చేయకుండా (కాన్ఫిడెన్షియల్) రహస్యంగా ఉంచుతుంటారు. ఇక్కడ విశేషం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్మోహనరెడ్డిల భేటీ అయిన తరువాత 12గంటల వ్యవధిలోనే ఈ జివో విడుదల అయ్యింది. శుక్రవారం కెసిఆర్, వైఎస్ భేటీ సుమారు ఆరు గంటల పాటు జరిగింది. ఈ బేటీలో మచిలీపట్నం పోర్టు అంశం గురించి చర్చకు వచ్చిందనీ, పోర్టును తెలంగాణకి అప్పగించాలని కెసిఆర్ కోరగా దానికి ఏపి సిఎం జగన్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎమ్మెల్యే, మంత్రి పేర్ని వెంకట్రామయ్య కూడా పాల్గొన్నారు.
సిఎం జగన్ ఆదేశాల మేరకు మచిలీపట్నం పోర్టును తెలంగాణకు కేటాయిస్తూ రహస్య జివో ఆర్టి నెం.62 తేదీ 28.06.2019 విడుదల చేసినట్లు సమాచారం. ఈ రహస్య జివోలో మచిలీపట్నం పోర్టు పూర్తి హక్కులు, సుమారు ఎనిమిదివేల ఎకరాల భూమిని తెలంగాణకు చెందే విధంగా ఆదేశాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలన వార్తగా మారింది. ప్రభుత్వ జివోల వెబ్సైట్లో అ జివో నెం కాన్ఫిడెన్షియల్‌గా కనబడుతోంది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించిన తెలంగాణ సిఎం కెసిఆర్ వైసిపి విజయానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన విషయం బహిరంగ రహస్యమే. దానికి ప్రతిఫలంగా మచిలీపట్నం పోర్టును ఇవ్వడానికి జగన్మోహనరెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని అప్పట్లో నారా లోకేష్ ఎన్నికల ప్రచారసభలో మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకువెళ్లేందుకు కెసిఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారంటూ ఆరోపణ చేశారు. అయితే ఈ ఆరోపణలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. నాడు లోకేష్ చేసిన ఆరోపణ నేడు నిజం అవుతుందా అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇంతకూ ఆ జివోలో ఏముందో ప్రభుత్వం వెల్లడిస్తే నెటిజెన్లలో ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయి.
Machilipatnam port #KCR Telangana Teskupovalani chustunnaru – AP IT minister @NaraLokesh #CBNMurderPolitics #CBNDigitalMafia #RavaliJaganKavaliJagan #APNeedsYSJagan#NippuPappuFailedAP pic.twitter.com/idYQoMVnat
— YS Jagan Trends™ (@YSJaganTrends) March 24, 2019