NewsOrbit
టాప్ స్టోరీస్

కడపపై వరాల వాన.. ఇదేనా అభివృద్ధి వికేంద్రీకరణ!?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత మూడు రోజులుగా తన సొంత జిల్లా అయిన కడపలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కోల్పోయినపుడు ఎవరూ లేరనుకుంటున్నపుడు మీరు కుటుంబంలా తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు మీ బిడ్డగా రుణం తీర్చుకుంటున్నా అని ఆయన ప్రకటించారు.

కడప జిల్లాలో, తన నియోజకవర్గమైన పులివెందులలో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడాన్ని విమర్శిస్తూ, అందుకు జారీ అయిన జీవోల జాబితా ఇస్తూ రూపొందించిన ఒక పోస్టు వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులంటున్న వారు  ప్రజాధనాన్ని ఇలా ఒకే చోట ఖర్చు చేయడం ఏమిటన్నది ఈ పోస్టు లేవనెత్తిన ప్రశ్న. ఈ కింద ఇస్తున్నాం, చదవండి:

గత అయిదు రోజులుగా పులివెందుల/కడపకు ఇచ్చిన జీవోలు. దాదాపుగా 30 జీవోలు, వీటి విలువ రూ.1300 కోట్లు వరకు ఉంటుంది. ఇదేనా మేధావులు చెప్పే, అభివృద్ధి వికేంద్రీకరణ? ఒకే ప్రాంతానికి, అదీ తన సొంత ప్రాంతానికి, రాష్ట్ర ప్రజల సొమ్ముని పెడుతూ, ప్రజలను మూడు రాజధానులలో కొట్టుకోమనటం.

జివో నం. ఎమ్ఎస్ 146 – కడప మెడికల్ కాలేజీలో, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కోసం, 125 కోట్లు కేటాయింపు.

జివో నం. ఎమ్ఎస్ 145 – కడపలో 100 పడకల మెంటల్ హాస్పిటల్ కోసం, 40.82 కోట్లు కేటాయింపు.

జివో నం. ఎమ్ఎస్ 144 – కడపలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి అనుమతి.

జివో నం. ఎమ్ఎస్ 142 – పులివెందుల లో వైఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం 347 కోట్లు కేటాయించారు.

జివో నం. ఎమ్ఎస్ 140 – కడపలో 100 పడకలతో వైఎస్ఆర్ కాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు.

జివో నం. ఆర్‌టి 1077 – కడపలో స్టేట్ ప్లాన్ ద్వారా, 20.95కోట్లతో, 5 బిల్డింగ్ల నిర్మాణం.

జివో నం. ఆర్‌టి 235 – కడపలో, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ నిర్మాణం కోసం, 5.20 కోట్లు.

జివో నం. ఆర్‌టి 756 – కడపలో బ్యూటీఫికేషన్ కోసం, 55 కోట్లు విడుదల.

జివో నం. ఆర్‌టి 755 – కడపలో రాజీవ్ మార్గ రోడ్ నిర్మాణం కోసం, 3.85 కోట్లు.

జివో నం. ఆర్‌టి 396 – పులివెందులకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 63 కోట్లు కేటాయించారు.

జివో నం. ఆర్‌టి 743 – కడపలో రూరల్ వాటర్ సప్లై కింద, 1,315 లక్షలు.

జివో నం. ఆర్‌టి 337 కడప జిల్లాకు కొత్త ఉర్దూ జూనియర్ కళాశాల కేటాయించారు.

జివో నం. ఆర్‌టి 573 – పులివెందులలో, ఇరిగేషన్ పనులకు 182.69 లక్షలు కేటాయించారు.

జివో నం. ఆర్‌టి పులివెందులలో, ఇరిగేషన్ పనులకు 146.93 లక్షలు కేటాయించారు.

జివో నం. ఆర్‌టి 574 –  పులివెందులలోని, వేంపల్లి దగ్గర, మూడు పనులకు 46.93 లక్షలు.

జివో నం. ఆర్‌టి 563 – కడపలో తుమ్మల చెరువు అభివృద్ధి కోసం, 41.02 లక్షలు కేటాయించారు.

జివో నం. ఆర్‌టి 569 –  కడపలోని, వెలిగల్లు ప్రాజెక్ట్ కాలువ ఆధునీకరణ కోసం 15 కోట్లు.

జివో నం. ఆర్‌టి 570 –  కడపలోని, జెర్రికొన రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఎత్తిపోసే ప్రాజెక్ట్ కోసం 19 లక్షలు.

జివో నం. ఆర్‌టి 359 – పులివెందులలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం, 17.50 కోట్లు కేటాయించారు.

జివో నం. ఎమ్ఎస్ 44 – వైఎస్ఆర్ ఉద్యాన వన విశ్వవిద్యాలయం అరటి పరిశోధన కేంద్రం కోసం పులివెందుల లోని 70.03 ఎకరాలు కేటాయించారు.

జివో నం. ఆర్‌టి 210 – పులివెందులలో  Jntu-A కాలేజీలో కాంప్లెక్స్ నిర్మాణం కోసం 10 కోట్లు కేటాయించారు.

జివో నం. ఆర్‌టి 753 – పులివెందుల మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం 100 కోట్లు విడుదల.

జివో నం. ఆర్‌టి 392 – పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీకి బడ్జెట్ లో 29 కోట్లు కేటాయించారు.

జివో నం. ఆర్‌టి 754 – పులివెందులకు, వాటర్ సప్లై కోసం 65 కోట్లు కేటాయించారు.

జివో నం. ఆర్‌టి 571 – కడప జిల్లాలో రాయచోటి మున్సిపాలిటీ కోసం 340.60 కోట్లు విడుదల చేశారు.

జివో నం. ఆర్‌టి 335 – పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులు కోసం 2013 లక్షలు విడుదల చేశారు

జివో నం. ఎమ్ఎస్ 84 – గండికోట రిజర్వాయర్ నుండి 2 TMC నీళ్ళు కడప జిల్లాలో పెట్టబోయే ఉక్కు కర్మాగారం కి కేటాయించారు. 1000 గేలన్ల నీళ్లు 5.50 రూపాయలకు ఇచ్చారు

author avatar
Siva Prasad

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment