NewsOrbit
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై ఈ నెల 20నే ప్రభుత్వ ప్రకటన!

అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. జనవరి 20న ఏపీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆరోజున హైపవర్‌ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని సహా రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణపై సభలో చర్చ జరగనుంది. జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికల్లో మూడు రాజధానుల ప్రతిపాదనలను చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలు సూచించిన అంశాలు, సిఫారసులపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాలకంటే ముందే జనవరి 18న ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. మూడు రాజధానులకు సంబంధించి కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. ఈ భేటీలో రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. జీఎన్ రావు, బీసీజీ కమిటీ ఇచ్చిన నివేదికలు, హైపవర్ కమిటీ సిఫారసులు, పాలన వికేంద్రీకరణపై మరోసారి దృష్టి సారించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికలను మంత్రివర్గం ఆమోదిస్తే మాత్రం అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో శాశ్వత హైకోర్టు ఏర్పాటుకు ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే సమయంలో అమరావతి రైతులకు భరోసాను ఇచ్చేలా జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీలో పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలతో పాటు పలు కీలక అంశాలపై ఇప్పటికే హైపవర్ కమిటీ చర్చించింది. రాజధాని ప్రాంత రైతులు, జిల్లాలు, ప్రాంతాల వారీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై కమిటీ చర్చించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి జరగాలని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను కమిటీ పరిశీలిస్తోందని, తప్పకుండా రైతుల ప్రయోజనాలను కాపాడతామని కమిటీలోని మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు.

మరోవైపు రాజధానిని అమరావతిని నుంచి తరలించొద్దని ఆప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని రైతులకు అండగా టీడీపీ అధినేత చంద్రబాబు పోరుబాటను మరింత ఉధృతం చేశారు. విపక్షాలను కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా అమరావతి రైతులకు అండగా మద్దతు కూడగడుతున్నారు. మరోపక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment