NewsOrbit
టాప్ స్టోరీస్

ఆర్టీసీ జేఏసీ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా ?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేస్తారా ? ఆర్టీసీ కార్మికుల సమ్మెను నడిపించడంలో పూర్తిగా విఫలమవ్వడంతో అశ్వత్థామరెడ్డి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. దాదాపు 52 రోజులు తమ డిమాండ్ల కోసం సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నేతృత్వం వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా మరో 26 డిమాండ్ల పరిష్కారం కోసం అక్టోబర్ 5 నుంచి కార్మికులు సమ్మె బాట పట్టారు. తమ జీవితాలను కూడా పణంగా పెట్టి మరీ సమ్మెలో పాల్గొన్న కార్మికులను.. యూనియన్ల మాట వినకుండా వచ్చి విధుల్లో చేరాలని కేసీఆర్ సూచించారు. విధుల్లో చేరేందుకు రెండు సార్లు అవకాశం కూడా ఇచ్చారు. అయితే కార్మికులు సీఎం మాటను పట్టించుకోలేదు. దీంతో కార్మికులు చేపట్టిన సమ్మె చట్టవిరుద్దమని, వారిని చర్చలకు పిలిచే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని, సంస్థకు నష్టాలు తెచ్చేలా వ్యవహరిస్తూ విధులకు హాజరు కావడం లేదంటూ వారిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక న్యాయం కోసం హైకోర్టుకు వెళ్లినా ఆర్టీసీ జేఏసీకి అక్కడ కూడా నిరాశే ఎదురైంది. పైగా, ఆర్టీసీ ప్రైవేటీకరణ కేసులో హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం కార్మికులకు గట్టి దెబ్బ తగిలింది. దీంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెను విరమిస్తున్నట్లు అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. అయితే, కార్మికులను భేషరతుతో విధుల్లోకి చేర్చుకోవాలని.. రూట్లను ప్రైవేటీకరణ చేయరాదని కోరారు. ఆయన ప్రకటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇష్టానుసారంగా సమ్మెకు దిగి.. ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా లేదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదన్నారు.

సమ్మె కాలంలో అశ్వత్థామరెడ్డి ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని, సొంత ప్రయోజనాల కోసం రాజకీయ వ్యాఖ్యలు చేశారని కొందరు కార్మికులు ఆరోపణలు చేస్తున్నారు. సమ్మె విరమణ సమయంలో కూడా ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకున్నారని మండిపడుతున్నారు. కార్మికులను నట్టేట ముంచారనే అపవాదు ఆయనపై పడింది. దీంతో మనస్తాపానికి గురైన అశ్వత్థామరెడ్డి.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఆయన స్పందించాల్సి ఉంది.

 

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment