అయోధ్య కేసు వాయిదా

ఢిల్లీ, జనవరి 4: అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించిన వ్యాజ్యాలు శుక్రవారం చీఫ్ జస్జీస్  రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చాయి.

ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను వినకుండానే జనవరి 10కి కేసును వాయిదా వేసింది.  కనీసం 30 సెకన్లు కూడా  ఈ కేసు విచారణ జరగలేదు.  అయోధ్య కేసు విచారణ ప్రారంభం కాగానే ఛీఫ్ జస్జిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.  ఈ కేసు విచారణకు హాజరైన ఇరుపక్షాలకు చెందిన సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వె, రాజీవ్ ధవన్‌లనుంచి ఎటువంటి వాదనలు వినకుండానే కోర్టు విచారణను వాయిదా వేసింది.