టాప్ స్టోరీస్

ప్రచారాస్త్రంగా ‘చౌకీదార్’!

Share

ఢిల్లీ: మోదీ నాయకత్వంలోని బిజెపి మై భీ చౌకీదార్ నినాదాన్నిఎన్నికల ప్రచారంలో చొప్పించింది. దేశ అభివృద్ధికి పాటు పడే ప్రతి ఒక్కరూ చౌకీదారే అంటూ చౌకీదారే దొంగ అని తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోది ప్రారంభించారు. మై భీ చౌకిదార్ (నేను కూడా కాపలదారుడినే) అంటూ ఒక వీడియోను విడుదల చేశారు.

ముద్రా యోజన, ఉజ్వాలా యోజన, క్లీన్ ఇండియా సహా మోది ప్రభుత్వం ప్రారంభించిన పలు ప్రధాన పధకాలను ఆ వీడియోలో తెలియజేసారు.

మార్చి 31 న ప్రధాని మోది నిర్వాహిస్తున్న “మై భీ చౌకిదార్” కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలని కోరుతూ ఆ వీడియో ముగుస్తుంది.

మోది ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  ‘మీ చౌకీదార్‌ ఇక్కడ నిలబడి దేశం కోసం సేవ చేస్తున్నారు. కానీ నేను ఒంటరి కాదు. అవినీతి, సామాజిక రుగ్మతలు, అపరిశుభ్రతపై పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ చౌకీదారే. దేశ అభివృద్ధి కోసం కష్టపడుతున్న వారంతా చౌకీదార్లే. ‘నేను కూడా కాపలాదారునే’ అని నేడు ప్రతి భారతీయుడు సగర్వంగా చెబుతున్నాడు’ అని మోది ట్వీట్‌ చేశారు.

రఫేల్ ఒప్పందం విషయంలో మోదీని, ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై (కాపలాదారుడు దొంగ) అని పలుమార్లు విమర్శించారు. రాహుల్ విమర్శలను ఎదుర్కొనేందుకు బిజెపి ఈ వీడియోను విడుదల చేసింది.

వీడియో కోసం కింద క్లిక్ చేయండి


Share

Related posts

బిజెపి అభ్యర్థి గౌతమ్ గంభీర్‌కు ఇసి షాక్

somaraju sharma

270 టిఎంసిలు సముద్రం పాలు

somaraju sharma

ప్రచారం మోది ఊపిరి : రాహుల్

sarath

Leave a Comment