రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ట్రాఫిక్‌లో బస్సుకు దాటుకొని ముందుకు వెళ్లాడనే కారణంతో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిపై బస్ డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగుళూరులోని మహదేవ్‌పురాలో చోటు చేసుకుంది. బీఎంటీసీ వోల్వో వెళ్తుండగా ముందుకు దూసుకెళ్లిన వాహనదారుడిని ఆపి ఇష్టం వచ్చినట్టుగా దాడి చేశారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతోడ్రైవర్‌ సంతోష్‌ బాడిగర్‌ పై చర్యలు చేపట్టింది. అతన్ని సస్పెండ్‌ చేస్టున్నట్టు వెల్లడించింది.

ట్రాఫిక్‌లో వెళ్తున్న సమయంలో బీఎంటీసీకి చెందిన వోల్వో బస్సు కాస్త నెమ్మదించింది. అదే సమయంలో బైక్‌పై ఓ యువకుడు మరో అమ్మాయితో కలిసి బస్సును దాటుకొని వెళ్లాడు. దీంతో ఆగ్రహించిన వోల్వో బస్సు డ్రైవర్ సంతోష్ ఆ వ్యక్తిని ఆపి దాడి చేశాడు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే విచక్షణ కోల్పోయాడు. ఈ దృశ్యాలను బస్సులో ఉన్న హమీద్ అనే వ్యక్తి తన మొబైల్ లో రికార్డు చేశాడు. డ్రైవర్ తీరును ప్రశ్నించిన హమీద్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో తీసిన హమీద్‌పై కూడా డ్రైవర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే, ఈ వీడియో వైరల్ కావడంతో డ్రైవర్‌ అనుచిత ప్రవర్తనకు బీఎంటీసీ వెంటనే స్పందించి అతన్ని సస్పెండ్ చేసింది.


Share

Related posts

మంత్రి బ్లాక్ మెయిల్: కస్టడీలోకి జర్నలిస్టు

Kamesh

రొమాంటిక్ మోసగాడికి జైలుశిక్ష

Kamesh

నక్షత్రాన్ని తినేసిన బ్లాక్ హోల్!

Siva Prasad

Leave a Comment